హరితహారాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి


Thu,April 18, 2019 12:19 AM

- పేట జిల్లాలో కోటీ 84లక్షల మొక్కల పెంపకమే లక్ష్యం
- ఉపాధి హామీ, అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ వెంకట్రావు

నారాయణపేట టౌన్ : నారాయణపేట జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, జిల్లాలో కోటీ 84లక్షల మొక్కల పెంపకమే లక్ష్యమని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుదవారం నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో ఉపాధి హ మీ, అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో మొక్కలను పంపిణీ చేయాలన్నారు. నీడనిచ్చే మొక్కల పెంపకానికి ప్రత్యేక కృషి చేయాలన్నా రు. అన్ని గ్రామపంచాయతీలను కలుపుతూ మొక్కల పెంపకాన్ని చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాత పాలమూరు జిల్లా పరిధిలో గుడుంబా ను అరికట్టేందుకు గానూ ఈత మొక్కలను పెంచాలన్నారు. అన్ని రకాల మొక్కలను అందుబాటులో నర్సరీలలో ఉంచుకోవాలన్నారు. ఉపాధి హామీ, అటవీ శా ఖ అధికారులు కలిసికట్టుగా పనిచేసి హరితహారం కా ర్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు చింత, అల్లనేరెడు మొక్కలను పెంచాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో రఘువీరారెడ్డి, డీఎఫ్‌వో గంగిరెడ్డి, డీహెచ్‌వో సరోజిని తదితరులు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...