యోగాతో మానసిక ప్రశాంతత


Thu,April 18, 2019 12:19 AM

మక్తల్, నమస్తే తెలంగాణ/ఊట్కూరు : ప్రతి మని షి జీవితంలో మానసిక ప్రశాంతత లభించాలంటే క్ర మం తప్పకుండా ధ్యానం చేయాలని మహబూబ్‌నగ ర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్, నారాయణపేట కలెక్టర్ వెంకట్రావులు అన్నారు. మక్తల్ మండలంలోని పస్పుల సమీపంలోగల దత్తపీఠంలో రంగారెడ్డి జిల్లా కన్హా శాం తివనం ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రాన్ని బుధవారం వారు ప్రారంభించారు. ముందుగా కలెక్టర్లకు దత్తపీఠ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవితం ఒత్తిడితో కూడుకున్నదని, ఆ ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరూ యో గా చేయాలని సూచించారు. మానవ జీవితంలో ప్రతినిత్యం ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమించి లక్ష్యం దిశగా ముందుకు సాగేందుకు ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ధ్యానం ఆచరించడంవల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కృష్ణానది తీరంలో ప్రశాంత వాతావరణం లో నెలకొన్న దత్తపీఠంలో ధ్యాన కేంద్రం ఏర్పాటు చే యడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులకు అనువుగా ఉం టుందన్నారు. అనంతరం పస్పుల సర్పంచ్ దత్తప్ప నేతృత్వంలో దత్త క్షేత్రంలో యోగా తరగుతులు నిర్వహించారు. కన్హా శాంతివనం నుంచి వచ్చిన గురూజీ కమలేశ్ పటేల్ యోగా చేయించారు. అనంతరం పం చదేవ్‌పహాడ్ వద్ద గల శ్రీపాదఛాయ ఆశ్రమంలో శ్రీ పాద వల్లభుడికి కలెక్టర్లు రొనాల్డ్‌రోస్, వెంకట్రావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారికి ఆశ్రమ నిర్వాహకులు చింత శ్రీపతిస్వామి స్వామి వారి చరిత్రను వి వరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం పస్పుల సర్పంచ్ దత్తప్ప కలెక్టర్లను శాలువా, పూలమాలలతో సన్మానించి దత్తపీఠం చరిత్ర పుస్తకాలను అందజేశారు. అదేవిధంగా ఊట్కూరు జిల్లా పరిషత్ బాలు ర ఉన్నత పాఠశాలలో చేగూరు ధ్యాన కేంద్రం ఆధ్యాత్మిక గురువు కమ్లేశ్‌డి పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధ్యాన శిక్షణ శిబిరానికి కలెక్టర్ హాజరయ్యారు. కా ర్యక్రమంలో సబ్‌కలెక్టర్ క్రాంతి, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో విజయనిర్మల, దత్త పీఠాధిపతులు రామప్రసన్ననంద సరస్వతీ స్వా మి, నిరంజన మాతాజీ, ఈవోపీఆర్డీ పావని, ఐసీడీఎస్ సీడీపీవో జయ, సూపర్‌వైజర్ రాజేశ్వరి, సర్పంచులు కల్పన కృష్ణాచారి, వెంకటేశ్వర్‌రెడ్డి, కుర్వ పెద్ద వెంకటప్ప, ఊట్కూరు సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, కన్హా శాంతివనం వాలంటీర్లు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...