రోడ్డు ప్రమాదాలు నియంత్రిద్దాం


Thu,April 18, 2019 12:19 AM

- పాలమూరు ఎస్పీ రెమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ క్రైం : రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తమ ప్రాణాలను కో ల్పోతున్నారని, రో డ్డు ప్రమాదాలు జరగకుండా నియంత్రిద్దామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి కోరారు. బుధవారం ఆమె మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో మరణాలు సంభవించడంతోపాటు, ఎంతోమంది వికలాంగులై కుటుంబాలకు భారంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపైకి వెళ్లితే కు టుంబ సభ్యులు ఆందోళనగా గడిపే దుస్థితి వచ్చిందని, దీనిపై అందరూ ఆలోచించాల్సి న అవసరం ఉందన్నారు. అవసరం లేకున్నా పిల్లలకు వాహనాలు ఇప్పించడం, వాహన ప్రయాణంలో కనీస జాగ్రత్తలు పా టించకపోవడం, తోటి మనుషుల ప్రాణాలు, జీవితంపై ఏ మాత్రం గౌరవం లేకపోవడం వంటి దుర్లక్షణాలే రోడ్లను రక్తపు మడుగులు చేస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ మరిన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ప్రయాణికులను రవాణా చేసే వాహనదారులు నిబంధనలకు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన రహదారులను ప్రమాదరహితంగా మార్చుకునేందుకు రోడ్డు ప్రమాదాలను అరికడదాం..రోడ్డు ప్రమాద మరణాలను నివారిద్దాం..ప్రమాదాలు లేని రహదారులు నిర్మిద్దాం అంటూ ప్రతి ఒక్కరూ తమవం తు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ నినాదం ప్రతి ఇంటి నుంచి ప్రారంభమై, పిల్లల నుంచి పెద్దలదాక మానవత్వంతో ప్రచా రం కావాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది కూడా వ్యక్తిగతంగా చట్టాలను అనుసరిస్తూ రోడ్డు ప్ర మాద రహిత వ్యవస్థ నిర్మాణంలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. చట్టాన్ని అమలు పర్చే పోలీసులు ట్రాఫిక్ ని యమలు పాటిస్తూ స మాజాన్ని చైతన్యం చేయాలని, నిబంధన లు ఉల్లంఘించిన వా రెవరైనా విక్షార్హులు అ వుతారని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...