పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి


Wed,April 17, 2019 12:49 AM

-మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్
మహబూబ్‌నగర్ క్రైం : రానున్న హనుమాన్ జ యంతి, రంజాన్ పర్వదిన పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రజల శాంతి సమావేశాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ రానున్న పర్వదినాలను పురస్కరించుకొని వివిధ వర్గాల ప్రజలతో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ప్రజల సహాకారం అత్యున్నతమైనదని, మన స్నేహ భాంధవ్యాలే సమాజ అభివృద్ధికి బాట లు వేస్తాయని తెలిపారు. హనుమాన్ జయంతి, రంజాన్ పర్వదిన నేపథ్యంలో మనమందరం ఒక కుటుంబ సభ్యుల వలె మసులుకుంటూ జిల్లా ప్రజల అనుబంధాన్ని చాటుకుందామని వివరించారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ శ్రీనివాసాచారి, వన్‌టౌన్ సీఐ రాజేష్, పట్టణ ప్రముఖులు, సమాజ హితులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...