ప్రతిభ గల విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు


Wed,April 17, 2019 12:49 AM

మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ : జిల్లా కేంద్రంలోని ఆదర్శ జూనియర్ కాలేజీలో శిశుమందిర్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై పట్టు సాధించడానికి వేసవి శిక్షణా తరగతులు శ్రీ సరస్వతి విద్యాపీఠం పాలమూరు జిల్లా అధ్యక్షుడు శ్రీమద్ది అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో ప్రారంభమైందని గౌని రాంరెడ్డి అన్నారు. ఈ శిక్షణా తరగతులు నెల రోజుల పా టు కొనసాగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆంగ్లంలో సంభాషించడం అందరికీ అవసరం అని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షకులు ఎస్.రెడ్డి అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా శిశుమందిరాలు కూడా ఆంగ్ల మా ధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు శిశు మందిరాలు కూడా ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్‌పై పట్టు సాధించుటకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. మద్ది అనంతరెడ్డి మాట్లాడుతూ మాతృభాష వచ్చిన ప్రతి ఒక్కరూ ఇతర భాషలను సులభంగా నేర్చుకుంటారని, ఇంగ్లిష్‌కు దూరంగా ఉండి భయపడనవసరం లేదని, నేర్చుకుంటారని, ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ నేర్చుకునేందుకే పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. నేడు ఆంగ్ల భాషకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేసవి శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక శిక్షకుడిగా హాజరైన ఏఎస్ రెడ్డి గారు తెలుగు భాషతోపాటు ఆంగ్లంపై పట్టు పెంచుకోవలసిన అవసరం తప్పనిసరి అన్నారు. శిశు మందిరాల ద్వారా సంస్కృతీ సంప్రదాయాలను ఆంగ్లంలో కూడా బోధించి దేశభక్తిగల పౌరులను తయారు చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో యాదయ్య గుప్త, శంభు పుల్లయ్య, చంద్రశేఖర్, రాజేష్, చంద్రశేఖర్ గుప్త, దత్త చౌద రి, కృష్ణమోహన్, మహాలక్ష్మీ, ప్రధానాచార్యులు చంద్రయ్య పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...