పిల్లల మర్రికి పూర్వ వైభవం


Wed,April 17, 2019 12:48 AM

- ఆర్గాలాజీ మ్యూజియం అందర్నీ ఆకర్షించేలా ఉంచండి
-మ్యూజియం, పిల్లల మర్రిని పరిశీలించిన పురవాస్తు శాఖ రాష్ట్ర డైరెక్టర్ విశాలాచ్చి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పాలమూరు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన పిల్లలమర్రికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పిల్లలమర్రిలోని ఆర్గాలాజీ మ్యూజియంను, విరిగిన పిల్లలమర్రి కల్పవృక్షంను మొలకెత్తేందుకు తీసుకున్న చర్యలను పురవాస్తు శాఖ రాష్ట్ర డైరెక్టర్ విశాలాచ్చితో కలిసి కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్గాలాజీ మ్యూజి యంను సందర్శిస్తూ సందర్శకులను మరింత ఉపయోగకరంగా ఉండేలా పిల్లలమర్రిలో మరిన్ని సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మ్యూజియంను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులకు మ్యూజియం గూర్చి ఇక్కడ ఉన్న వివిధ అంశాలతోపాటు వాటి ప్రత్యేకత గూర్చి ప్రత్యేకంగా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి సేవాలందిచాలని సూచించారు. ప్రస్తుతం విరిగిన చోట మొలకెత్తెందు కు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. తక్కు వ సమయంలోనే పిల్లలమర్రి చెట్టుకు పూర్వవైభవం తీసుకురావడం జరుగుతుందని తెలి పా రు. ఎక్కడ ఎలాంటి స మస్యలు లేకుండా అధికారులు ప్ర త్యేకం గా చర్యలు తీసుకుంటూ పిల్లలమర్రి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల అభివృద్ధికి ప్రత్యే క చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావులేకుండా పిల్లలమర్రి చెట్టు విరిగిన ప్రాంతా ల్లో బలంగా మొలకెత్తేందుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని ఆటవీ సంరక్షణ అధికారులకు సూచించా రు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టి కి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈ సధ్య, తదితరులు ఉన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...