జనరల్ దవాఖానలో..అధునాతన బ్లడ్‌బ్యాంక్ సేవలు


Wed,April 17, 2019 12:48 AM

-ప్రారంభించిన దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.పుట్టా శ్రీనివాస్
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : ప్రభుత్వ జనరల్ దవాఖాన బ్లడ్ బ్యాంకులో అధునాతన ఎస్‌డీపీ (సింగిల్ డోనర్ ప్లేట్లేట్) మిషన్, రిఫ్రిజ్‌రేటేడ్ సెంట్రిఫిజ్‌డ్ మిషన్ సేవలను జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.పుట్టా శ్రీనివాస్ ప్రారంభించా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన సేవలను రోగులకు అందిస్తున్నారు. జనరల్ దవాఖానలోని బ్లడ్ బ్యాంకులో రూ.25 లక్షల ఖర్చుతో విలువైన ఎస్‌డీపీ మిషన్ సేవలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మిషన్‌ను సూపరింటెండెంట్ డా.రాంకిషన్, మె డికల్ కళాశాల డైరెక్టర్ డా.పుట్టా శ్రీనివాస్ ప్రారంభించారు. డెంగ్యూ రోగులకు రక్తంలో ప్లేట్లెట్ మాత్రమే అవసరం ఉంటుందని, బ్లీడింగ్, బర్న్ అయిన రోగులకు రక్తంలో ప్లాస్మా మాత్రమే అవసరముంటుంది. ఇలాంటి సమయంలో దాత నుంచి అవసరమైన కణాలను మాత్రమే గ్రహించి మిగిలిన వాటిని మరలా పంపిస్తుంది. ఈ ఎస్‌డీపీ మిషన్ సేవలు అత్యంత ఖరీదైనవి. ఒక్క కిట్టు వి లువ రూ.10వేలు వరకు ఉంటుందని, ఈ కిట్టు ఒక్క రోగికి మాత్రమే ఉపయోగించే వీలుంటుందన్నారు. మరో మిషన్ సెంట్రీ ఫీజ్‌డ్ రిఫ్రిజ్‌రేటర్ మిషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చా రు. దీని విలువ రూ.13 లక్షలు ఉంటుంది. ఈ సెంట్రీ ఫీజ్‌డ్ మిషన్ సేవలు రక్తంలో ఉండే కణాలను వేరుచేసే విధంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో పాథాలజీ హెచ్‌ఓడీ డా.నావల్ కిశోర్, జనరల్ మెడిసిన్ డా.నిశాంత్, అసిస్టెంట్ డైరెక్టర్ కార్తిక్‌రెడ్డి, బ్లడ్‌బ్యాంక్, ల్యాబ్ సిబ్బంది, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...