వేసవిలో నీటి ఎద్దడిని నివారించండి


Wed,April 17, 2019 12:48 AM

-సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు
నారాయణపేట టౌన్ : వేసవికాలం జిల్లా పరిధిలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ వెంకట్రావ్ అన్నారు. మిషన్ భగీరథ, ఇంట్రా, మెయిన్ గ్రిడ్ శాఖల ఇంజినీయర్లతో మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో నీటిసరఫరా విషయంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోస్గి, దామరగిద్ద, ధన్వాడ మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిదని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఎక్కడ పూర్తి చేయలేదో వాటిని సత్వరమే పూర్తిచేయాల న్నారు. అన్ని గ్రామాల్లో నీటి సరఫరా జరిగేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ట్యాంకులను నెలకోమారు శుభ్రం చేయాలని సూచించారు. మండలాల్లో గ్రామా ల్లో నీటి సమస్య ఏర్పడితే వెంటనే తన దృష్టికి తీసుకరావాలన్నారు. పైప్‌లైన్‌లు ఎక్కడా పగులకుండా నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీయర్లు పుట్ట వెంకట్‌రెడ్డి, జయబాయి, డీఈలు పాల్గొన్నారు.

అవినీతి రహిత పాలన అందించాలి
పేట జిల్లాలో అవినీతిరహిత పాలన ప్రజలకు అందించాలని, అందుకు నూతనంగా ఎన్నికైన పంచాయతీ సెక్రటరీలు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నూతన పంచాయతీ సెక్రటరీలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసి మాట్లాడారు. గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం పంచాయతీ కార్యదర్శుల చేతుల్లోనే ఉందన్నారు. ఆయా గ్రామాలకు కేటాయించిన పంచాయతీ కార్యదర్శులు గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు, పారిశుధ్యం, తాగునీటి వసతి, లబ్ధిదారులకు ఆహార భద్రతాకార్డులు అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహించి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. డీఆర్‌వో రవికుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డీపీవో మురళి పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...