ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు సన్నద్ధం కండి


Wed,April 17, 2019 12:47 AM

-కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
-అధికారులతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : త్వరలో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పక్కా ప్రణాళికలతో సన్నద్ధం కావాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో జెడ్పీ సీఈవో, డీపీవోలతో పాటు సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బ్యాలెట్ విధానంలో జెడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయని, అధికారులు అం దుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ ఎలాంటి ని ర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే సం బంధిత ఎన్నికల సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, వారందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 14 మండలాల్లో జరుగనున్న ఎన్నికల నిర్వహణ బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఎలాంటి సందేహాలు వచ్చి నా వెంటనే నివృతి చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణ మొదలు కొని కౌంటింగ్ సంబంధించి ఏర్పా ట్లు కూడా పూర్తి చేయాలన్నారు. ఎంపీ ఎన్నికల కౌం టింగ్ మే 23 తరువాత, మార్గదర్శకాల ప్రకారం ఎం పీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేం ద్రాల ఏర్పాట్లు ఉండే లా చూసుకోవాలన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, బ్యాలెట్ బాక్సులను ప్రత్యేకంగా ఉంచేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు పూర్తి చేయాలని చె ప్పారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో వసంతకుమారి, డీపీవో వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...