దినాం పండగనే..!


Tue,April 16, 2019 02:53 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ ప్రతినిధి : ఏటా.. ఎప్పుడో ఓ సారి.. ఓ పండు గ వస్తుంది.. గ పండుగ నాడే.. పెండ్లాం పిల్లలతో ఖుషి ఖుషిగా గడుపుతరు.. గదేమో గానీ.. గీ యాడాది.. ముందుగాల నుంచే పండుగలొచ్చినయి.. ఒక్క దినం రెండు దినా లు కాదు.. వారం.. నెల అంత కన్న గాదు.. యాడాది పొడుగునా.. పండుగనే.. పండు గ.. అన్నట్లుగా సాగుతోంది.. వరుసగా ఒచ్చిన ఓట్ల పుణ్యమా అని ఓటర్లకే గాదు వాళ్ల కుటుంబాల్లో గూడా పండుగలా సాగుతుండది.. ఐదేండ్లకోసారి ఒచ్చే ఎలచ్చన్లు.. ఈ యాడాది.. ఒర్సగా ఎలచ్చన్లను దెచ్చి... పండుగలను దెచ్చింది. పోయిన యాడాది డిసెంబర్ల ఎమ్మెల్యేల ఎలచ్చన్లు జరిగయ్.. ఎలచ్చన్లకు మూడునెలల ముందుగాల నుండే షురు అయిన ఎన్నికల పండుగ వచ్చే జూలై దాక జరగేటట్లు ఉన్నయ్.. గా ఎమ్మెల్యే ఎలచ్చన్లల నాలుగు నెలలు రోజు పండుగ జేసుకున్న ఓటరన్నలు.. ఓటరక్కలు.. ఆయా పార్టీలొళ్ల తరపున ప్రచారం జేసిండ్రు.. పైస లు సంపాదించుకుండ్రు.. యాడ మీటింగులైన పోయిండ్రు.. నాయకులకు జై కొ ట్టిండ్రు.. ఎవరి సభకు పోయిన, ఏ నాయకుని యెంట తిరిగిన మా బతుకులను బాగుజేసేది గా గులాబీ పార్టే అని అందరికి జెప్పుకొని ఊరూరా గుండుగుత్తన కారు గుర్తోళ్లకు ఓట్లేసి యమ్మెల్యేలుగా గెలిపిచ్చిరి.. అందరిలా గలిసి సంబరాలు జేసుకుండ్రి... గా సంబరాలు.. అయిపోకముందే.. గా సర్పంచ్‌ల ఎలచ్చన్లు.. వచ్చినయ్.. ఇంగేం.. మళ్లీ పండుగనేజేసుకుండ్రి.. గీ ఎలచ్చన్ల గూడ గులాబీ పార్టోళ్లు మద్దతు ఇచ్చినోళ్లనే సర్పంచ్‌లుగా గెలిపిచ్చిరి.. సర్పంచులు బాధ్యతలు తీసుకుండ్రో లేదో.. గా ఢిల్లీల ఉండే ఎంపీల ఎలచ్చన్లు రానే వచ్చినయ్.. నెలన్నర రోజులు నాయకులు, కార్యకర్తలు ఓటర్లను దేవుండ్లుగా జేసి ఓళ్ల బాగోగులను జూసిరి.. చేతికిన్ని పైసలు ఇచ్చిరి.. గిక్కడ కూడా ఓటర్లంతా ఎన్ని సభలకు పోయినా..

ఏ నాయకునికి జైకొట్టిన మళ్ల కారోళ్లకే జై కొట్టిండ్రని ఇనిపిస్తుండది.. గిప్పడికే తక్కువల తక్కువ ఎనమిది నెలలు పండుగ జేసుకున్న ఓటర్లకు మళ్ల ఒకదాని తరువాత ఒక ఎలచ్చన్లు.. వచ్చిపడుతుండయ్.. ఊళ్లుల గిప్పుడిప్పుడే గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలచ్చన్ల సందడి షురు అయ్యింది. పోటీ జేయాలనుకున్నోళ్లు.. ఇంటింటికి దిరగవట్రి.. ఓటర్లకు మ స్క కొట్టవట్రి.. మేం గెలిస్తే మీకు మంచిగ జేస్తం అని జెప్పుకుంటుండ్రు.. దావత్‌లు.. ఇయ్యవటిండ్రు.. ఇయ్యాలనో.. రేపో నామినేషన్లు ఏయనింకే... గా ఎలచ్చన్ కమిషనొళ్లు నోటిఫికేషన్ అయితుండ్రు... గప్పటివరకు అందరి మద్దతును తీసుకొనింకే.. నాయకులు తిరుగుతుంటే ఓటర్లు మాత్రం.. తల ఊపు కుంటూ మేమే మా రాజులం.. అన్నట్లుగా గడుపుతుండ్రు.. వచ్చే నెలల ఎలచ్చన్లు...జరుగుతయని.. తెలుసుకొని ఓటర్లు సంతోసంగా గడుపుతుండ్రు.. గీ ఎలచ్చన్లు అయిపోకముందే.. గా ము న్సిపాల్టీ ఎలచ్చన్లు.. వచ్చేటట్లు అయితుండయ్.. గీ ఎలచ్చన్లుల పట్టణమోళ్లు.. ఖుషిజేసుకొనింకే.. గిప్పటి నుండే రెడీ అయితుండ్రు.. రిజర్వేషన్లు తెలువకున్నా మా కే వస్తదేమో అనుకొని కౌన్సిలర్లుగా పోటీచేయాలనుకుంటునోళ్లు గిప్పడి నుండే ఓటర్ల దేవుళ్ల మెప్పు కోసం పనులు షురూ జేసిండ్రు...మళ్ల పల్లెటూర్లుల గా సింగిల్‌విండో ఎలచ్చన్లు గూడా వస్తుండడంతో మల్ల ఓ చిన్నపాటి ఎన్నికల లొల్లి పల్లెలకు రానుండడంతో ఓటరన్నలు మాత్రం ఎన్ని ఎలచ్చన్లు వచ్చినా మా కోసమే అని మురిసిపోతుండ్రు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...