పాదేశిక ఎన్నికలు.. సజావుగా నిర్వహించాలి


Tue,April 16, 2019 02:52 AM

నారాయణపేట టౌన్ : త్వరలో జరగనున్న మండ ల, జిల్లా పరిషత్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధమవ్వాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. సోమవా రం నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటీఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి రెండు దఫాలుగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. మండల పరిషత్ క్లస్టర్ కో సం 61 మంది రిటర్నింగ్ అధికారులు, 62 మంది స హాయ రిటర్నింగ్ అధికారులను నియమిస్తామని తెలిపారు. జిల్లాలో ఈ ఎన్నికలను రెండు దఫాలుగా నిర్వహించాలని ప్రతిపాదనలు రూపొందించి ఎన్నికల కమిషన్‌కు పంపించామని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. అలాగే, జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్స్‌లో ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు ఇదే అంశంపై శిక్షణా కార్యక్రమా న్ని నిర్వహించారు. ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా ని ర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్డీవో శ్రీ నివాసులు, ఐసీడీఎస్ పీడీ శంకరాచారి, జెడ్పీ సీఈవో నర్సింగ్‌రావు, ఎంపీడీవో వెంకటయ్య, ఈవోఆర్డీ శ్రీ ధర్, ఆర్పీలు కృష్ణారెడ్డి, విశ్వనాథ్ ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు న్యాయం చేకూర్చాలి
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేం ద్రాలలో రైతులకు మద్దతు ధర చెల్లించి న్యాయం చేకూర్చాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కలెక్టరేట్‌లో డీఎస్‌వో, మార్కెటింగ్, ఏవోలు, ఏపీఎంలు, ఏఈవోలు, మెప్మా సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కా ర్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. వరిధాన్యం పండించిన రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అన్ని గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కోనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు చేయడానికి వీల్లేదని, అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు. జిల్లాలో మొత్తం 16 సెంటర్లను ఏర్పాటు చేశామని, ఒక్కో సెంటర్‌కు ఒక ఏఈవోను నియమించి ఎప్పటికిప్పుడు వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమై తే షెడ్ల ఏర్పాటు కూడా చేయించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి గ్రేడ్-ఏ రకానికి క్వింటాల్ మద్దతు ధర రూ.1770, కామన్ రకానికి రూ.1750 ధర చెల్లించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శారదా ప్రియదర్శిని, డీఎస్‌వో జ్యోతి, డీఆర్‌డీవో రఘువీరారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు రఘురాం పాల్గొన్నారు.

పాస్ పుస్తకాల పంపిణీని పూర్తి చేయాలి
జిల్లాలో మిగిలిపోయిన వ్యవసాయ భూముల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, ఆర్వోలు, వీఆర్వోలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మిగిలిపోయిన పాసుపుస్తకాల పంపిణీని ఈనెల 16వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో రవి, ఆర్డీవో శ్రీనివాసులు, కలెక్టర్ కార్యాలయ ఏవో బాలాజీ సపారే తదితరులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...