శాంతియుత వాతావరణానికి పోలీస్ శాఖ నిరంతర కృషి


Tue,April 16, 2019 02:52 AM

- పాలమూరు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి
- కేంద్ర బలగాలకు ప్రశంసా పత్రాలు అందజేత

మహబూబ్‌నగర్ క్రైం : ప్రజలకు శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతర కృషి చేస్తుందని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో విశేష సేవలందించిన కేంద్ర పారా మిలటరీ బలగాలను సోమవారం ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వచ్చిన ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల బందోబస్తు, శాంతికాములకు భరోసా కలిగిస్తూ కవాతు, వాహనాల తనిఖీల వంటి సందర్భాలలో స్థానిక పోలీసులకు కేంద్ర బలగాలు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. సమాజ శాంతి, ప్రజల రక్షణ కోసం పోలీసులందరూ కలిసికట్టుగా పని చేయడంవల్ల విజయం సాధిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, గిరిబాబు, నర్సింహులు, సాయిమనోహర్, ఇమ్మాన్యుయేల్, ప్రకాశ్ తివారి తదితరులు పాల్గొన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...