భూ సమస్యలకు ముగింపు పలకండి


Tue,April 16, 2019 02:52 AM

- ప్రజలకు అందుబాటులో ఉండాలి
- పాలమూరు కలెక్టర్ రొనాల్డ్‌రోస్

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : భూరికారు ల ప్రక్షాళనలో భాగంగా అన్ని గ్రామాల్లో భూ సమస్యలకు ముగింపు పలకాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామ ని, మిగిలిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భూ సమస్యలతో అనేకమంది కలెక్టరేట్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలు కాకుం డా మిగిలిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉం టూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసమస్యలు పరిష్కారమైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాలని తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యానికి తావివ్వొద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...