అంతా రామమయం


Mon,April 15, 2019 01:25 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : శ్రీ సీతారాముల కల్యాణోత్సవ వేడుక లు ఆదివారం జిల్లాలో అంబరాన్నంటాయి. తెల్లవారు జాము నుంచే భక్తు లు ఆలయాలకు చేరుకోవడంతో జిల్లాలని రామాలయాలన్నీ కిటకిటలాడా యి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయం, టీచర్ కాలనీలోని రామాలయం, శ్రీనివాస్‌కాలనీలోని పంచముఖ ఆంజనేయస్వామి, క్లాక్‌టవర్ సమీపంలోని రాంమందిర ం, లక్ష్మీ నారసింహస్వామి, భూత్పూ ర్, జడ్చర్ల నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో సీతారామల కల్యాణోత్స వ వేడుకలు ఘనంగా జరిగాయి. పం చముఖ ఆంజనేయస్వామి ఆలయం లో జరిగిన జానకీరాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన స్వగృహం నుంచి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు తీసుకెళ్లారు. అలాగే రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో, టీడీ గుట్టు, పాతతోట, రామాలయా ల్లో, రాంనగర్, గణేశ్ నగర్, శివశక్తినగర్, భగీరథ కాలనీతోపాటు పట్టణ కేంద్రంలో పలు ఆలయాలకు పాలమూరు టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేరుకుని భక్తులతో కలిసి ప్రత్యే క పూజలు జరిపారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆలయాలకు చేరుకోగానే వేదపండితుల మంత్రోచ్ఛరలతో సాదర స్వాగతం పలికారు. కల్యాణ వేడుకల ను తిలకించి భక్తులు భక్తిపారవశ్యం లో పరవశించిపోయారు. అనంతరం పలు చోట్ల భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పాలమూరు జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రసిద్ధి పొందిన శ్రీకురుముర్తి స్వామి ఆలయ ం, చిన్నరాజమూర్ గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం, మన్యంకొండలోని వెంకన్న ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొత్తకోట మండలం పామాపురం, అడ్డాకుల మండలం సీతారాంపల్లి ఆంజనేయస్వామి ఆలయాల్లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రామరాజ్య స్థాపన : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సీఎం కేసీఆర్ సారథ్యంలో రామరా జ్య స్థాపన జరుగుతుందని రాష్ట్ర ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పాలమూరు జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో జరిగిన రాములోరి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రిని మరో తిరుపతిగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అ డుగు పెట్టిన తర్వాత మరో రామరాజ్యంగా తీర్చిదిద్దుతారనే విశ్వాసం ఉం దన్నారు. భద్రాద్రి అభివృద్ధి అద్భుతం గా జరుగుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ ం అలుపెరగని పోరాటం చేస్తుందన్నా రు. దేవాలయాల అభివృద్ధికి ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామ స్థా యిలోని ప్రతి ఆలయాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించి ఆదర్శంగా తీ ర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు. కా ర్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ రా ధా, నాయకులు అమర్, రాజేశ్వర్, శ్రీకాంత్, ఆలయాల కమిటీ సభ్యులు, భక్తులు ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...