డివైడర్‌ను ఢీ కొట్టిన డీసీఎం


Mon,April 15, 2019 01:24 AM

మూసాపేట: జాతీయ రహదారిపై మూసాపేట వద్ద ఆదివారం తెల్లవారుజామున డీసీఎం డివైడర్‌ను ఢీ కొన్న ఘటనలోట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు, ఎస్సై మధుసూదన్‌గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హ్రైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న డీసీఎం మూసాపేట మలుపు రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్ విరిగిపోయి కర్నూల్ నుంచి హైదరాబాద్ వై పు వెళ్లే రోడ్డు మధ్య వరకు అడ్డంగా పడింది. అదే సమయంలో మరో వైపు నుంచి మోటర్ సైకిల్‌పై వస్తున్న శ్రీనివాసులు దానిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం మరో కారు వచ్చి ఆ బారికేడ్‌ను ఢీ కొట్టింది. దీంతో కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వేళ్లే రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపొయింది. డీసీఎం డ్రైవర్‌ను డీసీఎంతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై మధుసూదన్‌గౌడ్, కానిస్టేబుల్ నాగరాజు, సూరితో పాటు వచ్చి గాయపడిన శ్రీనివాసులును ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించారు. రోడ్డుకు అడ్డాంగా పడిఉన్న ఇనుప బారీకేడ్‌ను తొలగించి వాహనాల రాకపోకలను ప్రారంభించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అదేవిధంగా పారిపోయిన డీసీఎంను పట్టుకొని కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...