అంబేద్కర్ అందరివాడు


Mon,April 15, 2019 01:23 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : భారత రాజ్యాంగ నిర్మాత, మనందరికీ స్ఫూర్తి ప్రధాన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని.. ఆయన ఆశయ సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలోని చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూలమాలాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. సమాజంలో అంతరాలు సమసిపోవాలంటే చదువు ఒక్కటే అంతిమ మార్గమని విశ్వసించిన ఆయన విద్యకు అత్యంత ప్రాధాన్యం కల్పించారన్నారు. తమ ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగింపు కోసం ప్రతిక్షణం పనిచేస్తుందని తెలియజేశారు.

ఈ క్రమంలోనే దళితుల పిల్లలకు విదేశాలలో విద్య, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రత్యేక గురుకులాలు, దళితులకు 3 ఎకరాల భూమి ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాల కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ అంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి తమ కోసం జీవించడంతోపాటు మరో పది మందికి మేలు చేసే విధంగా అడుగులు వేస్తే ఎక్కడకు వెళ్లినా గుర్తింపు లభిస్తుందన్నారు. అంబేద్కేర్ ఆశయాలకు కొనసాగించడంతో ప్రతి ఒక్కరూ ఉత్తమ వ్యక్తులుగా తమ జీవితం సార్థకం అవుతుందన్నారు. ప్రజా సంక్షేమమే తన ఊపిరిగా భావించి అలుపెరగని పోరాటం చేసి ప్రతి ఒక్కరీ జీవితాలలో వెలుగులు నిం పిన అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధా అమర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కొరమోని వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు కొరమోని వనజ, జ్యోతి, చెరుకుపల్లి రాజేష్, నర్సిములు, అమరేందర్‌రాజు, వినోద్, వివిధ కుల సంఘాలు, ప్రజా సం ఘాల నాయకులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...