ఆశయ సాధనకు పాటుపడుదాం


Mon,April 15, 2019 01:23 AM

- రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి
జడ్చర్ల టౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం జడ్చర్ల పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలిలో దళిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ను స్మరిస్తూ ఆయన అడుగు జాడల్లో నడవాలన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.మురళి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...