మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ


Mon,April 15, 2019 01:23 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ ఉంటుందని, ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. కేబీఐ కరాటే సిల్వర్ జుబ్లీ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని గెలాక్సీ ఫంక్షన్‌హాల్‌లో కేబీఐ బుడోకాన్-డూ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ సీనియర్ చీఫ్ ఆర్గనైజర్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు కరాటే నేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. మాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ టోర్నీలో 120 మంది విద్యార్థులు పాల్గొనగా, 40 మంది బంగారు, 40 మంది వెండి, 20మంది కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో లుంబీని స్కూల్ డైరెక్టర్ లక్ష్మణ్‌గౌడ్, రచయిత రఘువీర్ ప్రతాప్, కేబీఐ ఏషియా చీఫ్ పరమేశ్, విద్యాజ్యోతి స్కూల్ డైరెక్టర్ సురేందర్‌పాల్, శ్రీకాంత్, విజయ్‌కుమార్, ప్రణీత్, మాస్టర్లు హజీ, వెంకటేశ్, శంకర్‌నాయక్, శివ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...