ఎన్నికలేవైనా.. జయం మనదే..


Sun,April 14, 2019 02:50 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మహబూబ్‌నగర్ పా ర్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, ఎంపీటీసీ. జెడ్పీటీసీ ఎ న్నికల సన్నాహాక సదస్సులో మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికీ రానివిధంగా అత్యధిక మెజార్టీ మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి వ స్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సిద్దాంతలను పక్కన బెట్టి ఏకమయ్యారని విమర్శించారు. కులాలు, మ తాల పేరుతో దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తామన్నారు. లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘ న విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టిస్తామన్నా రు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జెడ్పీలతోపాటు ఎం పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పా రు. క్రమశిక్షణగా ఉండి పార్టీ కోసం పని చేసే వారి కి అండగా ఉంటామని, కష్టపడి పనిచేసే వారికి స ముచిత స్థానం కల్పిస్తామన్నారు. ప్రజలకు న్యా యం చేసేవిధంగా మున్సిపాలిటీలో కొత్త చట్టం తెస్తామని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాల్లో కూడా సీఎం కేసీఆర్ పేను మార్పు తేనున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొంది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు
- టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పిటీసీ స్థానాలను గెలించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నా రు. దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. మహబూబ్‌నగర్ అన్నివిధాలా అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామన్నారు.

ప్రజలు టీఆర్‌ఎస్ వైపే..
- మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం
ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నుంచి తాను గెలువడం కష్టమని చర్చ జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో 40వేల మెజార్టీతో గెలుపొందానని చె ప్పారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ నేతలు పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకర్గాల నుంచి వారికి 70వేల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి 2లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.

గెలుపే లక్ష్యంగా పని చేయాలి
l షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కోరారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని తెలిపారు. షాద్‌నగర్ లాంటి ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
ఎన్నికల్లో సత్తా చాటుదాం
- కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు. ఎంపీ స్థానంలో భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు దేశంలో మంచి ఆదరణ ఉందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి విజయం సాధిస్తామన్నారు.

ప్రభుత్వ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష
- ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష అని, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాలను భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందిస్తున్నారని, పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే ప్రతి ఎకరా సాగులోకి వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుందామన్నారు.

పార్టీ కోసం పనిచేసే వారికే గుర్తింపు
- కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి
క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ బలోపేతం కోసం పని చేసే కార్యకర్తలకే తగిన గుర్తింపు ఉంటుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డి ఇక్కడ మాత్రం బీజేపీకి ఓటు వేయాలని కార్యకర్తలకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డికి ప్రచారం చేయడానికి కొడంగల్ కార్యకర్తలే మల్కాజిగిరికి వెళ్లారని తెలిపారు. పాలమూరు ఎంపీగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలిచిన తర్వాత తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తలనీలాలు సమర్పిస్తానని గుర్నాథ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, దేవర మల్లప్ప, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, నాయకులు విఠల్‌రావు ఆర్యా, రాములు, కోరమోని వెంకటయ్య, రాజేశ్వర్‌రెడ్డి, జూపల్లి భాస్కర్‌రావు, రాజేశ్, లక్ష్మయ్య, శివశంకర్, వనజ తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...