2 లక్షల మెజార్టీతో ఎంపీ సీటు గెలుస్తాం


Sun,April 14, 2019 02:48 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని 2లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తామని రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జేజేఆర్ ఫంక్షన్‌హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు సిద్ధాంతాలు పక్కన బెట్టి ఒక్కటై టీఆర్‌ఎస్‌ను ఓడించాలని చూశాయని విమర్శించారు. జిల్లా చరిత్రలోనే ఎంపీ సీటు భారీ మెజార్టీ సాధిస్తుందని తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమే ఆ రెండు పార్టీలు ఎజెండాగా పెట్టుకున్నాయని విమర్శించారు. మిషన్‌భగీరథ ద్యారా ప్రతి ఇంటికి శుద్ధజలం అందిస్తున్నామని, మరో నాలుగేళ్లలో పాలమూరులో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలైందని, వచ్చే నెల 6,10,14 తేదీ మూడు విడతల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. పని చేసే కార్యకర్తలకు, నాయకులకు సముచితస్థానం కల్పిస్తామన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 5 జెడ్పీ చైర్మన్ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. కేంద్రమంతి, రా్రష్ట్రమంత్రులుగా పని చేసిన వారు మహబూబ్‌నగర్‌కు చేసిందేమీలేదన్నారు. రాష్ట్ర మంత్రిగా పని చేసి బైపాస్‌ను గద్వాలకు తీసుకెళ్లారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఇచ్చిన ప్రతి హమీని అమలు చేస్తుందన్నారు. జాతీయపార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కుల, మత రాజకీయాలు చేస్తున్న పార్టీలను నమ్మొద్దని , స్థానిక సంస్థ ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపా రు. సమావేశంలో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి , షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, రాష్ట్ర సంగీ త, నాట క అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, రాష్ట్ర టీఆర్‌ఎస్ కార్యదర్శి ఇంతియాజ్‌ఇసాక్, మా జీ ఎమ్మెలే గురునాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, విఠల్‌రావుఆర్యా, వైస్‌చైర్మన్ రాములు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...