అదిగో.. భద్రగిరి..!


Sat,April 13, 2019 06:29 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : శ్రీరామనవమికి సర్వం సిద్ధమైంది. భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 14న(ఆదివారం) శ్రీసీతారాముల కల్యాణం, 15న (సోమవారం) శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ ప్రధాన వేడుకల నేపథ్యంలో వేలాది మంది భక్తులు భద్రాద్రి చేరుకునే అవకాశముంది. భక్తులరాకను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పట్టణంలో అన్ని ఏర్పాట్లు చేసింది. కల్యాణం నిర్వహించే మిథిలా ప్రాంగణం అందంగా ముస్తాబైంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్యాణం తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. సెక్టార్ల వారీగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేశారు. కల్యాణం టిక్కెట్ల విక్రయం జరుగుతోంది. రామాలయానికి విద్యుదీపాలతో అలంకరించడంతో పరిసరాలు శోభాయమానంగా మారాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ షామియానాలు ఏర్పాటు చేశారు. బ్రిడ్జీ సెంటర్, ఫైర్ స్టేషన్ వరకు సైతం దారి పొడవునా షామియానాలు ఏర్పాటు చేశారు. పట్టణ పురవీధుల్లో భక్తులకు స్వాగతద్వారాలు ఏర్పాటు చేశారు. కల్యాణ వ్యాఖ్యానం భక్తులందరికీ వినిపించేలా మైక్‌లు. ఆలయ పరిసరాల్లో సైడ్‌స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు, టిక్కెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు. కరకట్ట ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులకు తాత్కాలిక వసతి, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. గోదావరి తీరాన్ని ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తరుఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను అందజేస్తున్నారు. పాంచరాత్రాగమ సాంప్రదాయం ప్రకారం స్వామి కల్యాణం మధ్యాహ్నం 12గంటలు దాటిన తరువాత అభిజిత్‌లగ్నంలో నిర్వహించనున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...