అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి


Sat,April 13, 2019 06:28 AM

మిడ్జిల్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ప్రజాకవి గోరటి వెంకన్న పిలుపునిచ్చా రు. శుక్రవారం మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బా ద్మి శివకుమార్‌తో కలిసి గోరటి వెంకన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హ క్కు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కిందన్నా రు. అందరికీ సమాన హక్కులు కల్పించి రా జ్యాంగ ఫలాలు అందేలా కృషి చేశారని కొనియాడారు. యువతీ, యువకులు అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ప్రకాశ్ కళాబృందం తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎంపీపీ దీప, సర్పం చ్ సంయుక్తరాణి, నాయకులు శ్రీనివాస్ బహుదూర్, రాములు, కృష్ణయ్య, యాదయ్య, గోపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, వీరస్వామి, విజయ్‌కుమార్, నర్సింహులు, చెన్నయ్య, వెంకట్, జంగయ్య, సు కుమార్, బాలు, కృష్ణయ్య, మల్లేశ్, భీంరాజు, ప్ర తాప్, శేఖర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...