పోలింగ్ ప్రశాంతం


Fri,April 12, 2019 02:04 AM

- తీలేరులో 23మంది మాత్రమే ఓటేశారు..
- ఉదండాపూర్, బూరెడ్డిపల్లి గ్రామాల్లో సజావుగా పోలింగ్
- విలేకరుల సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్

మహబూబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియమ నిబంధనల మేరకు ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో చేపట్టామన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో బుధవారం జరిగిన ప్రమాదం కారణంగా కేవలం 23 మంది మాత్రమే ఓటు వేశారని తెలిపారు. ఎన్నికల అధికారులు నిబంధనల మేరకు సా యంత్రం 5 గంటల వరకు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. అలాగే, ఉదండాపూర్ గ్రామంలో రి జర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి పలు సమస్యలను చూపిస్తూ ఓట్లు వేయమని గ్రామస్తులు ఆందోళన చేపట్టగా, అక్కడికి వెళ్లి వారితో మాట్లాడి పోలింగ్ సజావు గా జరిగేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించా రు. బూరెడ్డిపల్లిలోనూ తాము జడ్చర్ల మున్సిపాలిటీ ప రిధిలోకి రాకుండా చూడాలని గ్రామస్తులు ఓటింగ్‌కు దూరంగా ఉంటామని చెప్పగా, వారితో మాట్లాడి ఓట్లు వేయించడం జరిగిందన్నారు.

పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఉదయం 6 గంటలకు మా క్ పోలింగ్ నిర్వహించామని, మాక్ పోలింగ్ సమయం లో బీయూలు 38, సీయూలు 26, వీవీపీఏటీలు 52 మొరాయించాయని, వీటి స్థానంలో కొత్త వాటిని సమకూర్చి పోలింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. ఎన్నిక ల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు. 2014 పార్లమెం ట్ ఎన్నికల్లో 71.3 శాతం ఓటింగ్ శాతం నమోదు కా గా, ఈ ఎన్నికల్లో కూడా ఆ స్థాయిలో ఓటింగ్ శాతం జరిగిందని తెలిపారు. ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ సెం టర్‌లో స్వీకరించి భగీరథ కాలనీలోగల జేపీఎన్‌సీఈ భవనంలో భద్రపర్చనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో స్వర్ణలత, డీపీఆర్వో పాండురంగరావు, ఏవో ప్రేమ్‌రాజ్ ఉన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...