ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదే ఓటు..


Fri,April 12, 2019 02:00 AM

- కుటుంబ సభ్యులతో కలి సి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
- తండ్రిని వీల్ చైర్‌లో పో లింగ్ కేంద్రానికి తీసుకువచ్చిన మంత్రి

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ఓటు కీలకపాత్ర వహిస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వీ. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ ముదిరా జ్ కమ్యూనిటీ హాల్‌లో ఆయన కు టు ంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈ సారి కూడా అదే స్థాయి లో పోలింగ్‌కు తరలివచ్చారని తెలిపారు. యువత, వి ద్యావంతులు, మే ధావులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఉ త్సాహం చూపించారని మంత్రి వివరించారు. నాకెందుకులే అనుకోకుం డా ప్రతి ఒక్కరూ ఓ టు హక్కును వినియోగించుకునాలని ఆయన సూచించారు. గుర్తింపు కార్డు లు లేకుండా కేవలం ఎన్నికల సంఘం జారీ చేసిన పోలింగ్ స్లిప్పులతో వచ్చి పలువురు ఓటేసేందుకు ఇబ్బందులు పడిన విషయాన్ని మంత్రి గుర్తించారు. పోలింగ్ సిబ్బంది ఓటేసే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశా రు.

కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి...
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన తండ్రి, భార్య, కూతుళ్లతో కలిసి పోలింగ్ కేం ద్రానికి వచ్చారు. మోకాళ్ల నొప్పులతో పోలింగ్ కేంద్రానికి నడిచి వచ్చే పరిస్థితి లేనందున తన తండ్రి నారాయణ గౌడ్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లేందుకు స్వయంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీల్ చైర్ తోసుకుంటూ వచ్చారు. మంత్రి వీల్ చైర్‌లో తన తండ్రిని తీసుకువస్తున్న దృశ్యాలను చూసిన ఓటర్లు.. ఢిల్లీకి రాజైన తల్లిదండ్రులకు కొడుకే... అందుకే తండ్రిని స్వయంగా తానే పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్లో తీసుకువస్తున్నాడని అనడం కనిపించింది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...