టీఆర్‌ఎస్‌లోకి 800 మంది చేరిక


Mon,March 25, 2019 02:59 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ : నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీఎల్‌ఎఫ్, బీజేపీ, టీడీపీలకు సర్పంచులు, వార్డు స భ్యులు, దాదాపు 800 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. నా రాయణపేటలోని జీ.పీ.శెట్టి ఫంక్షన్ హాల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులమై తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ప్రకటించారు. నారాయణపేట పట్టణానికి చెందిన బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు బండి శివరాంరెడ్డి, మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు బండి రాజేశ్వరి, 3వ వార్డు ఆకుతోట వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి, వేమారెడ్డి, పగడాకుల తిరుపతిరెడ్డిలు ఉన్నారు. 9వ వార్డు చంద్రశేఖర్‌యాదవ్, జ్ఞానేశ్వర్‌యాదవ్, శేఖర్, సాయిరాంయాదవ్, శ్రావణ్, మణికంఠ, చైతన్య, శివకుమార్, వినోద్‌లు ఉన్నారు.

నారాయణపేట మండలం నుంచి శ్యాసన్‌పల్లికి చెందిన సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులతో పాటు దాదాపు 150 మంది పార్టీలో చేరారు. బోయిన్‌పల్లి తండాకు చెందిన ఉపర్సంచ్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు మీనా, లక్ష్మమ్మ, సునిత, వెంకటేష్‌నాయక్, శివనాయక్‌లతో పాటు మరో 25 మంది చేరారు. ధన్వాడ మండలం గౌని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్పంచ్ భారతిసచిన్, ఉపసర్పంచ్ చిన్న నర్సింహులు, వార్డు సభ్యులు మ్యాకలి బాలప్ప, గౌని లక్ష్మమ్మ, నర్సిరెడ్డి, కుర్వ వెంకటమ్మ, కుర్వ మల్లేశ్‌లతో పాటు మరో 50 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా కంసాన్‌పల్లికి చెందిన ఎద్దుల రఘు, నర్సింహులు చేరారు. మాజీ జెడ్పీటీసీ మద్దెల్‌బీడ్ వెంకట్‌రెడ్డి, జుట్ల సత్యనారాయణగౌడ్, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, ఆంజనేయులుయాదవ్‌లతో పాటు మరో 40 మంది పార్టీలో చేరారు. కోయిలకొండ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొతలాబాద్ రాజేంద్రప్రసాద్, పెర్కీవీడ్ సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి, ఖాజీపూర్ సర్పంచ్ కల్పన బుచ్చిరెడ్డి, గంగ్యానాయక్‌తండా సర్పంచ్ రెడ్యానాయక్, కేశ్వాపూర్ సర్పంచ్ మొగులయ్య, రాజునాయక్‌తండా సర్పంచ్ సక్రీబాయి, లింగుపల్లి సర్పంచ్ అనిత, వీరంపల్లి సర్పంచ్ ఆంజనేయులు, పల్గుతండా సర్పంచ్ హీరాలాల్, రామన్నపల్లితండా సర్పంచ్ చక్రవర్తి, ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ వనజ, ఉబ్బడితండా సర్పంచ్ శాంతి, వింజామూర్ ఉపసర్పంచ్ భీమయ్యయాదవ్ ఇతర నాయకులు చేరారు. మరికల్ మండలం నుంచి మరికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుమ్మరి చెన్నప్ప, గాజుల కమాల్, బోయ నర్సింహులు, మరో పది మంది ఉన్నారు. ఎల్లిగండ్ల మాజీ సర్పంచ్ లింగారెడ్డి, సాకలి చిన్నబాలు, చెన్నరాయుడతో పాటు మరో 15 మంది ఉన్నారు.దామరగిద్ద మండలం నుంచి చాకలోనిపల్లికి చెందిన లక్ష్మప్ప, గొల్ల వెంకటప్పలతో పాటు మరో పది మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...