సదరం శిబిరాలకు..దివ్యాంగుల క్యూ


Mon,March 25, 2019 02:59 AM

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : ఉమ్మడి పా లమూరు జిల్లాలో సదరం శిబిరాలకు దివ్యాంగు లు సదరం ధ్రువపత్రాల కోసం వస్తే అక్కడి సిబ్బ ంది నిర్లక్ష్యపు సమాదానం, బెదిరింపులతో దివ్యా ంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లను ప్రస్తుతం ఇస్తు న్న రూ. 1500 నుంచి రూ.3016కు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఈ హామీ అమలు కానుంది. ఈ నేపధ్యం లో దివ్యాంగులు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసే శిబిరాలకు బారులు తీరుతున్నారు. దీంతో ధ్రువీకరణ పత్రాల కోసం తీవ్ర ఆవస్థలు పడుతున్నా రు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4301397 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లను తీసుకొంటున్నా రు. ఇందులో దివ్యాంగ పింఛనుదారులు 60,74 5 మంది(14.11శాతం) ఉన్నారు. ప్రస్తుతం వీరి కి నెలనెల రూ.1500 అందజేస్తున్నారు. అంటే నెలకు రూ. 9,11,17,500 దివ్యాంగ లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తోంది. శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా ఏప్రిల్ నుంచి రూ. 3016ను దివ్యాంగులకు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇదివరకటి లెక్కల ప్రకారం దివ్యాంగులకు ఇచ్చే బడ్జెటు రూ. 18,32,06,920 కోట్ల కానుంది.

ఎన్నికల ముందువరకు సదరం శిబిరాలకు నామమాత్రంగానే దివ్యాంగులు వచ్చేవారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రతి మంగళవారం ఏర్పాటు చేసే సదరం శిబిరానికి సగటున 80 మంది వరకు వచ్చేవారు. ప్రభుత్వం పింఛన్ల ను పెంచనున్నట్లు ప్రకటించడంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకి దివ్యాంగులు బారులు తీరుతున్నారు. గత మూడు వారాల గణాంకాలు పరిశీలిస్తే.. జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి మంగళవారం 200 నుంచి 250 మంది వరకు వికలాంగులు వారి బంధువులతో కలసి సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించు సదరం శిబిరంలో సగటున 30 మంది పరీక్షలకు వచ్చేవారు. ఈ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో పరీక్షల కోసం వచ్చారు. చెవిటి, మూగ, ఆందులు, మానసిక, ఆర్థోపేడిక్ విభాగాల్లో దివ్యాంగులకు సదరం ధ్రు వీకరణ పత్రాలను అందిస్తారు. ఈ పత్రాల ఆధారంగానే ఆసరా పింఛన్లకు ఆర్హులు ఆవుతారు. వనపరి జిల్లా, గద్వాల జిల్లాలో 2018లో సదరం శిబిరాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఈ జిల్లాలో సదరం శిబిరాలు జరగడం లేదు. సదరం క్యాంపు లు ఏర్పాటు చేయాలంటే స్పెషాలిస్టు వైద్యులతో పాటు ప్రత్యేక నిధులను మంజూరు చేయాలి.

ఆసరా పింఛన్ కోసం దివ్యాంగుల కష్టాలు
ఆసరా పింఛన్‌ల కోసం దివ్యాంగులు సూదుర ప్రాంతాల నుంచి ఎండాకాలంలో వస్తే వారికి ధ్రు వపత్రాలు అందకపోవడంతో పాటు సదరం శిబిరంలో పనిచేస్తున్న డీఆర్డీఏ సిబ్బంది సరిగా వ్యవరించపోవడంతో పాటు వింకలాంగులు ఆవస్థలు పడుతున్నారు. దివ్యాంగులు ఉన్న స్థలంలోనే డీఆర్డీఏ సిబ్బంది ఉండి వారికి సహాయం చేయాల్సింది పోయి సదరం యూనిట్ ఉన్న గదిలోని కిటికిలోంచి సిబ్బంది పనిచేస్తున్నారు. కొందరు కాలులేని వికలాంగులు అక్కడికి పోలేక రద్దీలో పి ంఛన్ కోసం కష్టాలు పడుతున్నారు. కొందరైతే ప నికాకపోవడంతో తిరుగుప్రయాణం అవుతున్నారు.

ఏజెంట్లతో నడిపిస్తున్న నిర్వాహకుడు
సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 1500 నుంచి రూ. 3016కు పెంచారు. కాని ఇక్కడ జనరల్ దవాఖానలోని సదరం శిబిరంలో పని చేస్తున్న ఓట్‌సోర్సింగ్ నిర్వాహకుడు అన్ని తా నేగా వికలాంగుల ధ్రువపత్రాల జారికి కొంత మందిని ఏజెంట్లుగా పెట్టుకుని చక్రం తిప్పుతున్నాడు. వికలాంగుల పింఛన్ పొందడానికి కొంద రూ ఏజెంట్లతో కలసి నిర్వాహకుడు డబ్బులు వ సూలు చేస్తున్నట్లు పలువురు వికలాంగులు ఆరోపిస్తున్నారు. సదరం కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో లేకపోవడంతో పాటు అక్కడికి ఎవరైన టోకెన్ల కోసం వచ్చేవారికి సరైన సమాదా నం చెప్పెవారులేక వికలాంగులు సదరం ధ్రువపత్రాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొందరు ఏజెంట్లను పెట్టుకుని ఆక్రమంగా సదరం శిబిరం లో ధ్రువపత్రాలను అమ్ముకుంటున్నారు. వికలా ంగులు ధ్రువపత్రాలు జారీ చేయడానికి కూడా మూడు నెలల సమయం తీసుకుంటున్నారు. ఎవరైన ఏజెంట్లు ఆడిగితే వెంబడే ధ్రువపత్రాలు ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

వికలాంగులపై బెదిరింపులు
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్ల కోసం మంగళవారం ప్రభుత్వ జనరల్ దవాఖానకు వ చ్చిన వికలాంగులను సదరం నిర్వాహకుడు ఆగ్ర హం వ్యక్తచేయడంతో పాటు సమాదానం చెప్పలే క బెదిరింపులకు పాల్పడ్డాడని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరూ రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చిన వారిని ఇప్పడు మీకు పరీక్షలు ని ర్వహించమని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పా టు టోకెన్ల అందక తిరిగి మళ్లీ వచ్చే మంగళవారం రమ్మని చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. దరఖాస్తు కోసం దూర ప్రాంతాలనుంచి వచ్చిన వికలాంగులకు ముందే సమాచారం కానీ పత్రిక ప్రకటన ఇవ్వాలేదని వికలాంగులు సైతం ఆందోళన చెందారు. వారి సంఖ్యకు అనుగుణంగా యం త్రాగం తగిన ఏర్పాట్లు చేయడం లేదు. వారి నుం చి ఆవసరమైన పత్రాలు తీసుకోవాడానికి సదరం శిబిరంలోని కీటికీలోంచి కౌంటరును ఏర్పాటు చేసింది. కనీసం తాగడానికి మంచినీటిని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వృద్ధులు, వికలాంగుల సైతం కూర్చోడానికి ఏర్పాటు చేయకపోవడంతో కటిక నేలపై సేదతీరారు. టోకెన్ల సైతం క్రమ పద్ధతిలో ఇవ్వకపోవడంతో వికలాంగులు ఒకరిని ఒక్కరని తొసుకుని గుమికూడారు. శనివారం కలెక్టర్ రోనాల్డ్ రోస్ టీబీ నివారణ కా ర్యక్రమానికి సమయానికి వచ్చిన సదరంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉదయం 10:30 గంటలు అయిన ఇక్కడికి రాలేదు. దీంతో సదరం టోకెన్ల కోసం వచ్చిన వికలాంగులు సదరం వద్ద టోకెన్లకోసం వేచి చూస్తున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...