విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి


Mon,March 25, 2019 02:58 AM

పెద్దమందడి : మండలంలోని మోజర్ల గ్రామ శివారులోని ఓ రైతు పొలం వద్ద ఖిల్లాఘణపురం మండలం సోలీపురం గ్రామానికి చెందిన వలగొర్ల కృష్ణయ్య (35) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సంఘటన కు సంబంధించిన వివరాల మేరకు పెద్దమందడి మం డలం అమ్మపల్లి గ్రామానికి చెందిన దేశి వెంకటయ్య ఇంట్లో జరుగుతున్న వివాహానికి సోలీపురం గ్రామానికి చెందిన వలగొర్ల కృష్ణయ్య హాజరయ్యారు. మోజ ర్ల శివారులోని శారాగట్టు సమీపంలో ఉన్న దర్గా వద్ద కందురు చేసేందుకు బందువులతో కలిసి కృష్ణయ్య అతని కుమారుడు భాస్కర్‌తో కలిసి దర్గా దగ్గరికి వెళ్లా డు. కృష్ణయ్య స్నానం చేసేందుకు తన కుమారుని వెం టబెట్టుకొని దర్గా సమీపంలోని మోజర్ల శివారులో గ ల కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు మొగులయ్య వ్యవసాయ బోరు దగ్గరికి వెళ్లాడు. ఆడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె కు తగిలి విద్యుత్ షాక్‌కు గురై కృష్ణయ్య మృతిచెందా డు. అక్కడే ఉన్న రైతు మొగులయ్య నేరం నుంచి తప్పించుకునేందుకు కృష్ణయ్య శవాన్ని గడ్డివాములో దాడిపెట్టాడు. మృతుడు కృష్ణయ్య కుమారుడైన భాస్క ర్ రహదారిని గుర్తు పట్టకుండా కండ్లకు గంతలు కట్టి బైక్‌పై తీసుకువచ్చి వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లాడు. కృష్ణయ్య కుమారిని ఆచూకి తెలుసుకు న్న కుటుంబ సభ్యులు తండ్రి విషయమై ఆరా తీయ గా విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు తెలిపాడు. బం ధువులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా అక్కడ మృ తదేహం కన్పించలేదు. కృష్ణయ్య మృతిచెందినట్లుగా విషయం బయటికి తెలిసినట్టుగా బావించిన రైతు మొగులయ్య కొత్తకోట సీఐ వెంకటేశ్వరావు ముందు లొంగిపోయాడు. సంఘటన స్థలానికి సీఐ చేరుకొని గడ్డివాము నుంచి కృష్ణయ్య మృతదేహాన్ని బయటికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

కాటవరంలో..
అడ్డాకుల : మండలంలోని కాటవరం గ్రామంలో ఆదివారం నల్లా గుంతలోకి దిగి కరెంటు మోటర్ వైరు తగిలి భాగ్యలక్ష్మి (30) మృతి చెందింది. దీనికి సంబ ంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాగునీటి నల్లా గుంత నుంచి మోటర్ ద్వారా ఇంటిలోకి నీరు పడుతున్న సమయంలో మోటర్‌కు ఉన్నటువంటి విద్యుత్ వైరు ఊడిపోవటంతో న ల్లా గుంతలోకి దిగి వైరును బిగుస్తుండగా కాలు నీటి గుంతలో ఉండటంతో కరెంటు షాక్‌తో మృ తి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు. విద్యుత్ అధికారు లు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. బందువుల ఆందోళన.. విద్యు త్ షాక్‌కు గురై మృతి చెందిన భాగ్యలక్ష్మిని వారి బం ధువులు రాకుండానే పోలీసులు పోస్టుమార్టం నిమి త్తం మహబూబ్‌నగర్‌లోని జిల్లా దవాఖానకి తరలించడంతో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టా రు. బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎందుకు పంపించారని ఎస్‌ఐ నరేష్ పోలీసు సిబ్బందిని నిలదీశారు. అసలు కరెంటు షాక్ తో మృతి చెందిందా.. లేక ఎంకేమైనా చేసి చంపారా.. అంటూ పోలీసులను ప్రశ్నించారు. పోస్టుమార్టం చేయకుండానే మృత దేహాన్ని కాటవరం తీసుకురావాలని మృతురాలి బంధువులు పట్టుపట్టారు. చివరికి గ్రామస్తులు, పోలీసులు సర్ది చెప్పటంతో ఆందోళన విరమించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...