కాబోయే ప్రధాని కేసీఆర్


Sun,March 24, 2019 01:02 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి/దేవరకద్ర, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని గుర్తించిన వివిధ రాష్ర్టాల నేతలు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని... ఆయనే కాబోయే ప్రధానమంత్రి అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో 16కు 16 సీట్లు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటే కేంద్రంలో కేసీఆర్ కీలకపాత్ర వహించడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జడ్చర్ల చంద్ర గార్డెన్స్, దే వరకద్రలో ఏర్పాటు చేసిన ఆయా నియోజకవర్గా ల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ద్వా రా సుమారు 100 మంది ఎంపీ సీట్లు కలిసివస్తాయన్నారు.కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని, అందుకే కేసీఆర్ కేంద్రంలో కీలకపాత్ర వ హించాలని ఇతర రాష్ర్టాల నేతలు కోరుతున్న విషయాన్ని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. కేంద్రంలో మనం చక్రం తిప్పాలంటే రాష్ట్రంలోని మొత్తం ఎం పీ సీట్లు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరా రు. గతంలో ఎంపీగా గెలిచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక పదవి వెలగబెట్టిన ఓ జాతీ య స్థాయి నేత పాలమూరులో కనీసం మంచి నీరు రాకుంటే పట్టించుకునలేకపోయారని గుర్తు చేశారు. పాలమూరుకు 15 రోజులకు ఒకసారి కష్టంగా మంచినీరు వచ్చే పరిస్థితుల్లోనూ వారు స్పందించలేకపోయారన్నారు.

ఢిల్లీలో ఉండి రాజకీయం చేసి కీలక పదవులు అనుభవిస్తే సరిపోదని... వెనకబడిన ఈ ప్రాంతానికి అభివృద్ధి చే యాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం స్థానికుడైన మన్నె శ్రీనివాస్‌రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా అవకా శం రావడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరగబోతోందన్నారు. పాలమూరు సమస్యలపై అవగాహన ఉన్న శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడి సమస్యల పరిష్కారానికి ఆయనకు అవకాశం కల్పించాలన్నారు. మహహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అంతా నాన్ లోకల్ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని... ఒక్క టీఆర్‌ఎస్ నుంచి మాత్రమే పక్కా లోకల్ అభ్యర్థి బరిలో నిలిచారని తెలిపారు. కూత వేస్తే పలికే ఎంపీ కావాలా... గెలిచి పత్తా లేకుండా పోయే వారు కా వాలా... అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతం వారికి ఇక్కడి సమస్యలు ఏం తెలుస్తాయని మంత్రి ప్రశ్నించారు. పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ముఖ్య నేతలు, కార్యకర్తలు కష్టపడాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ లాంటి ఎన్నో పదవులు కష్టపడిన వారికే దక్కుతాయన్నారు. ప్రస్తుతం జరిగే ఎంపీ ఎన్నికలు మన బతుకుదెరువు కోసమని, మన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేందుకని ఆయన అన్నారు. గతంలో ఎప్పుడు లేనంత మెజారిటీ ద్వారా పాలమూరు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పాలమూరుపై ప్రత్యేకాభిమానం
- జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలమూరుపై ప్రత్యేకాభిమానం ఉందని, అందుకే ఆయన సీఎం అయిన వెంటనే ప్రతిష్ఠాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. రూ. 35వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే కేంద్రంలో మనం చక్రం తిప్పాల్సిన అవసరం ఉందన్నారు. 12 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు అందించే పాలమూరు ప్రాజెక్టు ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండనుందన్నారు. రైతు బంధును కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ సైతం కాపీ కొట్టాయన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్, బీజేపీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేశాయన్నారు. ఎన్నో చిన్న చిన్న దేశాలు వనరులు లేకున్నా బాగుపడ్డాయని... కానీ ఎంతో అపారమైన వనరులున్న మన దేశం మాత్రం బాగుపడలేదన్నారు. మన జిల్లా, మన రాష్ట్రం, దేశం బాగుపడాలంటే కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కీలకపాత్ర వహించాల్సిందేనని లకా్ష్మరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మండు వేసవిలోనూ రాష్ట్రంలో సమృద్ధిగా శుద్ధమైన తాగునీరు లభిస్తోందని... కేవలం మూడేళ్లలో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేయడం ద్వారానే దాహం తీరుతోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం అనంతరం ఇప్పుడు పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందన్నారు. 16 మంది ఎంపీలను గెలిపించడం సైతం పునర్నిర్మాణంలో భాగమేనని తెలిపారు. గ్రామాల్లో కార్యకర్తలు విస్తృతంగా తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని... ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఎకరాకూ నీరందిస్తాం
- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల
దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతులకు సాగునీటి వసతి కల్పించడంతోపాటు, అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి కృషి
- టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి
స్వరాష్ట్రం సాధించడం వల్ల ఈ ప్రాంతం ఎంతో బాగవుతుందన్న ఉద్దేశంతో 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉద్యమ నేత కేసీఆర్ పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో అభివృద్ధి జరుగుతోందన్నారు. 1969లో తాము ఏం అశించామో ఇప్పుడు అవన్నీ సాకారమయ్యాయని... ఇందుకు సీఎం కేసీఆర్ మాత్రమే కార్యసాధకుడని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోతున్నాయని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రతిపక్షాల నుంచి నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కట్టేందుకు రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధే కారణమన్నారు. ఒకప్పుడు వ్యవసాయం చేద్దామంటే కరెంటు లేక అన్నదాత ఎంతో ఆందోళనకు గురయ్యేవాడని... నేడు ఆ పరిస్థితి లేదని 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతుల కష్టాలన్నింటిని తీర్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా ఆయన పేర్కొన్నారు. సాగునీరు ఇప్పటికే చాలా ప్రాంతాలకు వచ్చిందని... భవిష్యత్తులో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. భూమి, ఆకాశం ఉన్నంత వరకు కేసీఆర్, గులాబీ జెండా ఉంటాయన్నారు. స్థానికుడినైన తాను అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ నుంచి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బాద్మి శివకుమార్, పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్ రావు ఆర్య తదితరులు పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...