అబ్బురపర్చిన బాల గాంధీజీ వేషధారణ


Sun,March 24, 2019 12:59 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, జిల్లా ప్రై వేట్ స్కూల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యం లో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెం దిన దాదాపు 1150 మంది విద్యార్థులు బాల గాం ధీజీ వేషధారణ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ భాస్కర్ విద్యార్థినీ, విద్యార్థులచే గాంధీజీ సూచించిన సత్యం, అహింస, క్రమశిక్షణ, స్వదేశీ వస్తువుల వాడకం, మధుర వచనాలు పలకడం, శ్రమదానం, ప ర్యావరణ పరిరక్షణ, మ ద్యపాన నిషేధం, మహిళాభ్యుదయం కోసం పాటుపడుతామని ప్ర తిజ్ఞ చేయించారు. అ నంతరం విద్యార్థులతో కలిసి రఘుపతి రాఘ వ రాజారాంపాటను ఆలపించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ సంస్థల చైర్మన్, డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, జిల్లా కన్వీనర్, ఎన్.ప్రభాకర్, ప్రభాకర్‌రెడ్డి, రామాంజనేయులు, ఏ.సుభాష్‌చంద్ర, శివ, రవీందర్‌రెడ్డి, గణేశ్, కళాభారతి, భానుప్రతాప్, మల్లికార్జున్, వెంకట్‌రెడ్డి, కోదండపాణి, బీఎల్ నారాయణ, హరినాథ్,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...