పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించండి


Sun,March 24, 2019 12:59 AM

- ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించండి
- మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సకాలంలో పోస్టల్ బ్యాలెట్ పత్రం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఉద్యోగులందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అదికారిణి సుచరిత, హార్టికల్చర్ అధికారిణి సరోజినీదేవి తదితరులు ఉన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...