శ్రీనివాస్‌రెడ్డికి బంపర్ మెజార్టీనిద్దాం


Sat,March 23, 2019 02:46 AM

మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ : మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్‌రెడ్డిని బ్ర హ్మాండమైన మెజార్టీతో గెలిపించేందుకు కృషి చే స్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పార్లమెం ట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మెహన్ రెడ్డి, రాజేందర్‌రెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజకీయల పట్ల ఆసక్తి, ప్రజలకు సేవచేసేందుకు జిల్లా వ్యక్తి, స్థానికుడిగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ బరిలో దింపడం హర్షనీయమన్నారు. తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డికి 18 వేల కోట్లు కేటాయించారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును మరో 2 ఏళ్లలో పూర్తి చేసి మహబూబ్‌నగర్ పార్లమెంట్‌ను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.

ఈ ప్రాజెక్టుకు రూ. 30వేల కోట్లతో రాష్ట్రంలో సాగునీరు ఇచ్చేవిధంగా నిధులు కేటాయించారన్నారు. పాలమూరు నియెజకవర్గంలోని 7 నియోజక వర్గాల ఎమ్మెల్యేలుగా సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి విజయం కోసం సహకరిస్తామన్నారు. గతంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు చెందిన నాయకులే మన పార్లమెంట్‌కు ఎంపీలుగా పనిచేసినా వారు స్థానికేతరులే అన్నారు. టీఆర్‌ఎస్ బలపరిచిన ఎంపీ అభ్యర్థులు 17 మందిని అత్యధిక మోజార్టీతో గెలిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారన్నా రు. మన సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి అయిన తర్వాత మన సమస్య మనం పరిష్కరించుకోవచ్చన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు జాతీయహోదా రావాలంటే టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలన్నారు. జాతీయ పార్టీల నాయకులు పేరుకే ఉన్నారని, 70 ఏళ్లు పాలించి ఏమీ అభివృద్ధి చేశారని మంత్రి ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలతోను రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. మన పార్లమెంట్ అభ్యర్థి మధ్యతరగతి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడన్నారు. కష్టపడి దేశ విదేశాలలో ఎమ్మెసెన్ ఫార్మ కంపెనీ పేరుతో స్థాపించారన్నారు. తెలంగాణ బిడ్డ, పాలమూరు జిల్లాకు చెందిన మన్నెం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక రాజకీయాల్లోకి రావడంపై ఆయనను అభినందించారు. జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి. లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చా రు.

కాంగ్రెస్, బీజేపీ నాయకత్వంలో దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు.ఈ మట్టిలో పుట్టిన నవాబ్‌పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన మన్నె శ్రీనివాస్ రెడ్డిని 3లక్షల మోజార్టీతో గెలిపించే విధంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ఎమ్మెల్యేలమంతా పనిచేస్తామని చెప్పారు. త్వర లో మేమందరం కలసి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా 7 నియోజకవర్గాలలో సభలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సం క్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రజలు కోనియాడుతున్నారన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి అదే సంకల్పంతో రాజకీయాల్లోకి తాను వ చ్చానన్నారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తికావడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు. జిల్లా ఎం పీ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు, జిల్లాలోని ఎమ్మెల్యేలందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర ్మన్ రాధాఅమర్, జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సింగిల్‌విండో డైరెక్టర్ కోరమోని వెంకటయ్య, వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు కృష్ణమోహన్, బాలకిషన్, 7 నియెజకవర్గాలోని టీఆర్‌ఆర్ నాయకులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...