నవాబ్‌పేట మండలానికి అరుదైన గౌరవం


Sat,March 23, 2019 02:45 AM

నవాబ్‌పేట : మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నవాబ్‌పేట మండలంలోని గురుకుంట గ్రామానికి చెంది న ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంఎస్‌ఎన్‌రెడ్డి సోదరుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డిని ఎంపిక చేయడం పట్ల మండలంలోని అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ పార్టీ అధినేత గుర్తించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవాబ్‌పేట మండలానికి చెందిన సామాన్య రైతు బిడ్డ శ్రీనివాస్‌రెడ్డిని ఎంపీ బరిలో నిలపడంపై అన్ని గ్రామాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో మండలంలోని నాయకులు ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు దా టి జిల్లా పదవులు చేపట్టిన దాఖలాలు లేవు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మాజీ జెడ్పీటీసీ రంగారావు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ పార్టీ గుర్తించకపోవడంతో ఆయన మండల స్థాయికే పరిమితమయ్యారు. అలాగే మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ శివదర్శనం అప్పట్లో టీడీపీలో జెడ్పీ చైర్మన్ అవకాశం కల్పిస్తామని చివరికి మొండిచేయి చూపారు. తదనంతరం మండలంలోని నాయకులెవరికి కూడా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పదవులు దక్కలేదు. కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించలేదు. వాటన్నింటినీ తిరగరా స్తూ...ముఖ్యమంత్రి కేసీఆర్ నవాబ్‌పేట మండలానికి అరుదైన అవకాశం, గౌరవం కల్పించారు. శ్రీనివాస్‌రెడ్డికి ఎవరూ ఊహించని విధంగా ఎంపీ టికెట్ ఇవ్వడంపై ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీనివాస్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో మండలంలో ప్రతిపక్షాలు లేకుండా పోయాయి. కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిగిన గ్రామాలు సైతం టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నాయి. ఇతర పార్టీల ఎంపీ అభ్యర్థులకు మండలంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో శుక్రవారం చేపట్టిన శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ దాఖలుకు మండలం నుంచి టీఆర్‌ఎస్ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం తరలివెళ్లారు. శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శీనయ్య, జెడ్పీటీసీ ఇందిరాదేవి, మా ర్కెట్ చైర్మన్ ముత్యాల రవీందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, యాదిరెడ్డి సంజీవరెడ్డి, అబ్దుల్లా, మెండె లక్షయ్య, పాశం గోపాల్, సంతోష్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, నారాయణ, చెన్నయ్య, నవనీతరావ్ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...