ఈవీఎంలను భద్రంగా ఉంచండి


Sat,March 23, 2019 02:45 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో అతి ముఖ్యమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాల మిషన్లను పకడ్బందీగా కేటాయించిన స్ట్రాంగ్ రూంలకు చేరవేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఈవీఎంలను భద్రపర్చిన గోదాంను జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేకంగా సందర్శించారు. ఈవీఎంల ఫస్ట్‌లెవల్ చెకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో స్ట్రాంగ్‌రూంలకు పంపిణీ చేసే ప్రక్రియకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో పకడ్బందీగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించాలని సూచించారు. ఏ నియోజకవర్గంలోని ఏన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.. ఎన్ని అదనంగా ఉన్నాయి ? అనే లెక్కలను పూర్తిగా పక్కాగా ఉండేందుకు చర్యలు తీసుకుంటు ముందుకు సాగాలన్నారు. మనకు అవసరమైన ఈవీఎం కంటే 20శాతం అదనంగా ఉండడం జరిగిందని, వీటి అన్నింటినీ పోలింగ్ స్టేషన్లకు అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే సిబ్బంది స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ పూర్తిస్థాయిలో శాంతయుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నటుల వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ క్రాంతి, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ వెంకటరమణ, దేవేందర్, తదితరులు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...