పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలి


Sat,March 23, 2019 02:45 AM

కోస్గిటౌన్ : పాలమూరు సస్యశ్యామలం కావాలంటే మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఎంతైనా అవసరమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొడంగ ల్ నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం పాలమూరులో మన పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్టం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో గెలవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులంతా కలసి కట్టుగా ఉండి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కొడంగల్ నియోజకవర్గం నుంచి గతం కంటె ఎక్కువగా ఎంపీ అభ్యర్థికి 40వేల మెజార్టీని ఇవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీన కోస్గి పట్టణంలోని పంచాక్షరి గార్డెన్‌లో కొడంగల్ ని యోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌తోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ఈ సమావేశంలో ఎంపీపీ ప్రతాప్‌రె డ్డి, జెడ్పీటీసీ అనితాబాల్‌రాజ్, ఎంపీటీసీ మ్యా కల రాజేశ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, నాయకులు ఓంప్రకాశ్, వెంకట్ నర్సిములు, మాస్టర్ శ్రీనివాస్, రాజశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌యాదవ్, శాసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...