ఘనంగా హోలీ సంబురాలు


Fri,March 22, 2019 01:50 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ : నారాయణపేట నియోజకవర్గంలో గురువారం హోలీ సంబరాలను ప్రజానీకం ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బుధవారం రాత్రి వరకు కామ దహాన కార్యక్రమాన్ని జరుపుకున్న యువకులు గురువారం తెల్లవారిందే తడువుగా రంగులు వేసుకోవడం ఆరంభించారు. స్నేహితులందరూ కలిసి బైక్‌లపై తిరుగుతూ తమ తమ స్నేహితుల ఇళ్ల వద్దకు వెళ్లి రంగులు వేశారు. ఇది ఇలా ఉండగా జిల్లా ఏర్పాటు తర్వాత మొదటి సారి జరిగిన హోలీ పండుగను ఈ సారి పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం. స్థానిక సిటిజన్స్ క్లబ్ ఆవరణలో అధికారికంగా హోలీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఎస్.వెంకట్రావు హాజరయ్యా రు. అదే విధంగా పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధు లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ సంస్థల సభ్యులు హాజరై కలెక్టర్‌కు రంగులు అంటించారు.

రూరల్ గ్రామాల్లో..
నారాయణపేట రూరల్ : మండల పరిధిలోని జాజాపూర్, సింగారం, శేర్నపల్లి, అప్పక్‌పల్లి, చిన్నజట్రం, అమ్మిరెడ్డిపల్లి, జిలాల్‌పూర్, కోటకొండ, కొల్లంపల్లి తదితర గ్రామాలలో హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో కామప్పను ఏర్పాటు చేసి గురువారం తెల్లవారు జామున కామ దహనం చేపట్టారు. చిన్నారులు, పెద్దలు వివిధ రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ సంబురాలను జరుపుకున్నారు. మహిళలు బొడ్డెమ్మలు వేస్తూ హోలీ పాటలను ఆలపించారు.
మరికల్‌లో..
మరికల్ : మండలం కేంద్రంలో గురువారం హోలీ పండుగను యువతీ యువకులు, చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం రాత్రి కాముని దహనం చేసిన గురువారం ఉదయం నుంచే హోలీ సంబురాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని నృత్యాలు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా ప్రజలు హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు.
మద్దూర్, దామరగిద్దలలో..
మద్దూరు/దామరగిద్ద : మండలంలో హోలీ సం బురాలు గురువారం ఘనంగా జరుపుకు న్నారు. మం డలంలోని వివిధ గ్రామాల్లో యువకులు, చిన్నారులు రంగులు చల్లుకుని ఆనందడోలికల్లో మునిగితేలారు. గ్రామాల్లో యువజన సంఘాల సభ్యులు కూడా ఆటపాటలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. అలాగే దా మరగిద్ద మండలంలోనూ చిన్నారులు, యువకులు, మహిళలు పెద్దఎత్తున హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గిటౌన్ : మండలంలో జోరుగా హోలీ సంబురా లు జరపుకున్నారు. గురువారం మండలంలో యువకులు, చిన్నారులు. మహిళలు పెద్ద ఎత్తున ఒకరికొకరు రంగులు చల్లుకంటు సంబురాలు చేసుకున్నారు. బుధవారం రాత్రి అన్ని వీధుల్లో కాముడి కాల్చి కుండలు పగులగొట్టారు. అలాగే కోస్గిలోని పలు అంగన్‌వాడీ కేం ద్రాలలో హోలీ సంబురాలు జరుపుకున్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...