24న హజ్ యాత్రికులకు శిక్షణ


Fri,March 22, 2019 01:49 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : ఈనెల 24న హజ్ యాత్రికులకు జి ల్లా కేంద్రం సమీపంలోని వైట్‌హౌస్‌లో శిక్షణా శిబిరం ఏర్పాటు చేసినట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మహమూద్ అలీ తెలిపా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణా శిబిరానికి ధార్మికవేత్త ముఫ్తీ ఆసీపుద్దీన్ నద్వి హాజరై హజ్, ఉమ్రా యాత్రపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. హజ్ యాత్రపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రాజెక్టర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణకు హజ్ యాత్రికులు సకాలం లో హాజరు కావాలని కోరారు. సమావేశంలో హజ్ సొసైటీ ప్రతినిధులు ఖలీల్ అహ్మద్, నయీం, తాజుద్దీన్, రఫీక్, నిజాముద్దీన్, ఇలియాస్ అహ్మద్, మీర్ అర్షద్‌అలీ, మీనాజుద్దీన్, మునీర్‌ఖాన్, అహ్మద్‌పటేల్, జహంగీర్, కలీముద్దీన్ తదితరులు ఉన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...