సామాజిక సేవలో భాగస్వాములవ్వాలి


Fri,March 22, 2019 01:49 AM

పాలమూరు యూనివర్సిటీ : విద్యార్థులు చదువుతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాము లు కావాలని మహబూబ్‌నగర్ మండలం బొక్కలోనిపల్లి సర్పంచ్ యుగంధర్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 వలంటీర్లు నిర్వహించిన శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే, ప్రజల్లో ఉన్న మూ ఢనమ్మకాలను తొలగించేందుకు విద్యార్థినులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి, హెచ్‌ఎం ఓంకార్, కళాశాల అధ్యాపకులు శివప్రసాద్, మధుసూదన్, చంద్రయ్య, రాజేందర్‌జీ, ఆంజనేయులు, ప్రసాద్, శివకుమార్ ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...