మిషన్ భగీరథతో నీటి కష్టాలు దూరం


Fri,March 22, 2019 01:49 AM

కోయిలకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మి షన్ భగీరథ పథకంతో తాగునీటి కష్టాలు దూరమయ్యాయని లిం గుపల్లి సర్పంచ్ అనిత అన్నారు. మండలంలోని అంగనమోనిబం డ తండాలో ఇంటింటికి ఏర్పాటు చేసిన నల్లాలను గురువారం ప రిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో వేసవి వచ్చిందంటే నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవార ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆవాస ప్రాంతంలో ట్యాం కులు, పైపులైన్లు నిర్మించి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించడం సంతోషంగా ఉందన్నారు. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని తండావాసులకు సూచించా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తౌర్యానాయక్ ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...