కన్నుల పండువగా కల్యాణం


Fri,March 22, 2019 01:48 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా : మన్యంకొండ అలివేలు మంగమ్మ తిరు కల్యాణోత్సవం గురువారం అలి వేలు మంగమ్మ ఆలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కల్యాణానికి జిల్లా నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కల్యాణాన్ని కనులారా చూసి తరించారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో హోలీ పండుగ రోజు అంగరంగవైభవంగా అలివేలు మంగమ్మ, వేంకటేశ్వరస్వా మి కల్యాణోత్సవాన్ని ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అమ్మవారు గురడ వాహన సేవ, విమాన రథోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా కల్యాణోత్సవానికి హాజరైన భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, దేవాలయ ఈవో వెంకటాచారి, పాలక మండలి సభ్యులు గంగాధర్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, అపర్ణారెడ్డి, గండయ్య, చిన్నయ్యగౌడ్, చంద్రమౌళి గుప్త, మంజుల, మహాలక్ష్మి, నర్సిములు, లక్ష్మీదేవి, వెంకట్రావు, శ్రీనివాసులు, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

కిక్కిరిసిన కురుమూర్తి కొండలు
చిన్నచింతకుంట : అమ్మాపూర్ గ్రామ సమీపంలో కొలువు దీరిన వేంకటేశ్వరుని ప్రతిరూమైన కురుమూర్తిస్వామి దర్శనానికి గురువారం ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పౌర్ణమితోపాటు సెలువు దినం కూడా కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరనించి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఘనంగా తిరుమలనాథస్వామి కల్యాణం
హన్వాడ : మండలంలోని యారోనిపల్లి, మాధారం గ్రామాల దగ్గరలో గుట్టపై వేలసిన తిరుమలనాథస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తిరుమలనాథస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భగుడి నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో తీసుకువచ్చి భక్తుల సమక్షంలో కల్యాణం నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కల్యాణోత్సవానికి కోయిల్‌కొండ, కోస్గి, మహబూబ్‌నగర్, నవాబ్‌పేట మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయం కమిటీ సభ్యులు అన్ని సౌకర్యలు కల్పించారు. ముఖ్యంగా ఎండకాలం సందర్భంగా చలివేంద్రంతో పాటు తాగునీరు పుష్కలంగా ఉంచారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...