ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే.. బంగారు తెలంగాణ


Fri,March 22, 2019 01:48 AM

జడ్చర్ల టౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని జడ్చర్ల ఎ మ్మెల్యే డాక్టర్ సీ.లకా్ష్మరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్చ ర్ల మండలంలోని ఉదండాపూర్ ఉపసర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే ల కా్ష్మరెడ్డి పార్టీ కండువా వేసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమాలతో అ న్నదాత కుటుంబాలకు ధీమా కల్పించారన్నారు. పేదిం టి ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.లక్షా 116 అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టు ల నిర్మాణాలను వేగవంతం చేసిందన్నారు. టీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, బంగారు తె లంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డిని పార్టీలో చే రిన వారు ఘనంగా సన్మానించారు. టీఆర్‌ఎస్‌లో చే రిన వారిలో ఉప సర్పంచ్ శేఖ ర్, వార్డు సభ్యులు గొం డ్యాల రాజు, సత్యమ్మ, మాజీ వార్డు సభ్యులు రామస్వామి, కృష్ణయ్య, వెంకటయ్య, శ్రీశైలం, యాదగిరి, శంకర్, మల్లయ్య, శ్రీను, లింగం, చిన్న రామస్వామి, చిన్న మల్లేశ్, నర్సింహ, యాద య్య, శ్రీశైలం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కోడ్గల్ యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్‌ఖాన్, శంకర్‌నాయక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...