నేరాలను తగ్గించేందుకే కార్డన్ సర్చ్


Thu,March 21, 2019 01:53 AM

భూత్పూర్ : నేరాలను తగ్గించేందుకే కార్డన్స్ అండ్ సర్చ్ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రెమారాజేశ్వరీ అన్నారు. బుధవా రం మండల పరిధిలోని అమిస్తాపూర్ గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహంలో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్లకు ఓ ప్రయివేట్ బ్యాంక్ (యాక్సిస్)కు సంబంధించి ఓ వాహనంలో రూ.53 లక్షల 50 వేలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడుతూ ఈ డబ్బులను ఎస్‌ఎస్‌టీ బృందానికి అప్పజెప్పారు. ఈ డబ్బులను ఎస్‌ఎస్‌టీ బృందం దేవరకద్ర ఎన్నికల అధికారికి తరలించారు. అక్కడ బ్యాంక్‌కు సంబంధించి, డబ్బులకు సంబంధించి వివరాలను చూపించి డబ్బులను తీసుకు వెళ్లండని చెప్పారు. అనంతరం కాలనీలో 130 ఇండ్లను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. ఈ పరిశీలనలో రెండు వాహనాలకు లైసెన్స్‌లు లేవని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎస్పీ దృష్టికి కాలనీ వెనుక భాగంలో గుట్టకు క్రషర్ మిషన్ ఉన్నందున్న బ్లాస్టింగ్ చేయడం వల్ల కాలనీలో భారీ శబ్దం రావడం వల్ల కొన్ని ఇండ్లకు గోడలు నెర్రెలు పారినట్లు, నోవాటెక్ దాణా కంపెనీ ఉన్నందు వల్ల ప్రతి రోజూ దుర్గందపు వాసన వస్తున్నట్లు తెచ్చారు. వీరి సమస్యల్ని విన్న అనంతరం ఆమె మాట్లాడుతూ కాలనీలోకి కొత్తవారిని రానీయకుండా ఉండాలని, వచ్చినా కూడా ఆధార్ కార్డు, పూర్తి అడ్రస్‌ను తీసుకోవాలని ఆమె తెలిపారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆమె కోరారు. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసమే పాటు పడతారని ఆమె తెలిపారు. పోలీసుల పట్ల ప్రజలు స్నేహపూర్వకంగా మెలగాలని ఆమె కోరారు. జిల్లా విస్తీర్ణం తగ్గినందు వల్ల పోలీసులు ప్రజలకు మరింత సేవ చేస్తారని ఆమె తెలిపారు. అనంతరం కాలనీ చిన్నారులకు ఎస్పీ చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, సీఐ పాండు రంగారెడ్డి, ఎస్‌ఐ పర్వతాలు, మరో 60 మంది పోలీసు ఇబ్బంది పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...