టీఆర్‌ఎస్‌లోకి బీరం..


Thu,March 21, 2019 01:52 AM

ఉమ్మడి పాలమూరులోనే ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించగా కొల్లాపూర్‌లో బలమైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఢీకొని గెలిచారు. బీరం గెలిచిన మరుసటి రోజు నుంచే టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో గత మూడు,నాలుగు రోజుల క్రి తం మళ్లీ బీరం కారెక్కుతారనే ప్రచారం జరిగినా అనుచరులు కొట్టివేశారు. చివరికి సీఎం కేసీఆర్ పిలుపుతో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో ఉ దయం బీరం సమావేశమయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌తో నాగర్‌కర్నూల్ ఎంఎల్‌సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డితో పాటు కొల్లాపూర్ అభివృద్ధిపై చ ర్చించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, అభివృద్ధికి సీఎం సహకారం కోరారు. దీనికి సీఎం, కేటీఆర్‌ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో బీరం టీఆర్‌ఎస్‌లోకి చేరికకు మార్గం సుగమమైంది. బీరం నిర్ణయం ఆయన అనుచరుల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. త్వరలో సీఎం సమక్షంలో బీరం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకొన్నట్లు సమాచారం. హైకోర్టు న్యాయవాదిగా ఉన్న బీరం 2014ఎన్నికల్లో తొలిసారిగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో రెండోసారి గెలవగా ప్రజలు ఆశీర్వదించారు. యువకుడైన బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ అభివృద్ధితో పాటుగా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.

అభివృద్ధి కోసమే : ఎమ్మెల్యే బీరం
కొల్లాపూర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, పా ర్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఇ చ్చిన సానుకూల హామీతోనే తాను కాంగ్రెస్‌కు రా జీనామా చేస్తున్నట్లు బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శరవేగం గా నిర్మిస్తున్నారని, దీనివల్ల పాలమూరు పచ్చగా మారుతుందన్నారు. వలస పోయిన వాళ్లు తిరిగి పాలమూరుకు వసుతన్నారని, పాలమూరు దు ఖం పోతుందన్నారు. ఇక కొల్లాపూర్ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కోసం తనను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని, తనకు ఇప్పుడు ని యోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్నారు. శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగావకాశాల కల్పన, సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం, పీఆర్‌ఎల్‌ఐ ముంపు బాధితులకు నష్ట పరిహారంలాంటి అంశాలపై బుధవారం తాను సీఎం, కేటీఆర్‌ల దృష్టికి తీసుకు రాగా సానుకూల స్పందన వచ్చిందన్నారు.

అలాగే మాదాసి కుర్వ సోదరుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలా నియోజకవర్గ అభివృద్ధి, ప్ర జల సంక్షేమం కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ఆ లేఖలో వివరించారు. దీనికోసం తాను అవసరమైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తానని బీరం స్పష్టం చేశారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...