స్థానిక ఎన్నికలపై పార్లమెంట్ ప్రభావం పడొద్దు


Thu,March 21, 2019 01:52 AM

భూత్పూర్ : పార్టీమెంట్ ఎన్నికల ప్రభావం త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడకుండా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఇంట్లో కొత్తకోట మండల టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్యే ఆల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తకోట మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజార్టీ వచ్చింది, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయాలని ఆయన కోరారు. ఇందుకు తన వంతు సహకారం ఏం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మంచి మెజార్టీ అందిస్తే వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చేయడానికి కూడా భయపడతారని సూచించారు. ముఖ్యంగా మండల నాయకులు గ్రామాల్లో ఉన్న కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. సమావేశంలో ఎంపీపీ గుంతమౌనిక, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వామన్‌గౌడ్, మండల నాయకులు విశ్వేశ్వర్, సాక బాల్‌నారాయణ, గాడిల ప్రశాంత్ పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...