పోలింగ్ బూత్ ఇన్‌చార్జిగా పనిచేస్తా...


Thu,March 21, 2019 01:51 AM

భూత్పూర్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి వచ్చిన 37వేల మెజార్టీని దాటి 50వేల పైచిలుకు మెజారిటీ సాధించేందుకు తాను ఓ సాధారణ కార్యకర్తలా పనిచేస్తానని.. అందుకై ఓ పోలింగ్ బూత్‌కు ఇన్‌చార్జీగా వ్యవహరించనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ బూత్ ఇన్‌చార్జీగా ఉండి కార్యకర్తల్లో మానసిక ైస్థెర్యాన్ని పెంపొదిస్తానన్నారు. పార్టీ దృష్టిలో ఎమ్మెల్యే అయినా సాధారణ కార్యకర్త అయినా ఒక్క టే అని ఆయన తెలిపారు. బుధవారం భూత్‌పూర్ మండలం అన్నాసాగర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సదస్సులో ఆయన ప్రసంగిం చారు. కారు... సారు.. పదహారు... కేంద్రంలో సర్కారు నినాదంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో చక్రం తిప్పి రాష్ర్టానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు, పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకునేందుకు, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా రాబట్టేందుకు.. కేంద్రంలో తెలంగాణ కీలకపాత్ర పోషించేందుకు 16 మంది ఎంపీలను గెలిపించుకునడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ప్రతి కార్యకర్త వీర సైనికుడిలా పనిచేసి ఎంపీ అభ్యర్థికి దేవరకద్ర నియోజకవర్గంలో 50వేల పైచిలుకు మెజారిటీ వచ్చేలా తీవ్రంగా కృషి చేయాలని కోరారు. గత పం చాయతీ ఎన్నికల్లో గ్రామా ల్లోని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కో ఊర్లో ఇద్దరు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేశారని.. ఆ విధంగా ఏర్పడిన మనస్పర్థలను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇందుకు మండల పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని ఆల సూచించారు.

పార్టీకి నేనూ సాధారణ కార్యకర్తనే..
టీఆర్‌ఎస్ పార్టీలో అందరూ క్రమశిక్షణ గల సైనికుల్లాంటి కార్యకర్తలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. తాను సైతం ఓ సాధారణ కార్యకర్తగానే భావించి పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునడం తన బాధ్యత అన్నారు. అందుకే పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిచ్చేందుకు తాను నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌ను ఎంచుకుని ఆ బూత్‌కు ఇన్‌చార్జీగా పనిచేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి మిగతా పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత సమర్ధంగా తమ విధులు నిర్వహిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ సైన్యంలో తాను సైతం ఓ సాధారణ కార్యకర్తనని ఈ సందర్భంగా ఆల స్పష్టం చేశారు.

23న నియోజకవర్గ స్థాయి సదస్సు
దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్‌లో ఈ నెల 23న దేవరకద్ర నియోజకవర్గ స్థాయి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సదస్సును ఏర్పాటు చేసినట్లు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. మార్చి 26 నుంచి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించనున్న తరుణంలో పార్టీ కార్యకర్తలంతా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఎమ్మెలే ఆల కోరారు. సదస్సులో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, ఎంపీపీ గుంతమౌనిక, వైస్ ఎంపీపీ కదిరెశేఖర్‌రెడ్డి, రైతుసమన్వయ సమితి కో ఆర్డీనేటర్ నర్సింహ్మాగౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు ఇంద్రయ్యసాగర్, వామన్‌గౌడ్, నాగార్జునరెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, జెట్టి నర్సింహ్మారెడ్డి, సత్తూర్ నారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గోప్లాపూర్ సత్యనారాయణ లతో పాటు దాదాపు 400మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...