మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు


Thu,March 21, 2019 01:51 AM

మహబూబ్‌నగర్ క్రైం : మద్యంతాగి వాహనం నడిపిన ముగ్గురి వ్యక్తులకు డ్రంక్‌డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పువెల్లడించినట్లు ట్రాఫిక్ సీఐ అమర్‌నాథ్ రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులో ట్రాఫిక్ సీఐ తన సిబ్బందితో కలసి డ్రంక్ డ్రైవ్ వాహన తనీఖిలు చేపట్టాగా ముగ్గురు మోటారు వాహనాదారులు మద్యంతాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారిపై డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు. వీరి వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు తరలించి,విరిని న్యాయస్థానం ముందు హజరు పర్చగా ఒక వ్యక్తి 15 రోజులు జైలు శిక్ష, మరో వ్యక్తికి 7 రోజులు, ఇంకో వ్యక్తికి 5 రోజులు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానాలు విధించినట్లు సీఐ తెలిపారు. ఈ ముగ్గురిని బుదవారం జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీలుగా తరలించినట్లు సీఐ తెలిపారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...