టెంపరేచర్-40 డిగ్రీలు


Wed,March 20, 2019 01:22 AM

-రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రత
-వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
-ఉక్క పోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : రోజు రోజుకు సూర్య ప్రతాపం పెరుగుతూ పోతుంది. మంగళవారం ఈ వేసవిలో ఇప్పటి వరకు నమోదు కానంతగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40డిగ్రీలు దాటింది. ఈ క్రమంలో ఇకపై నుంచి గరిష్ట్ర ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉండే అవకాశముందని వాతావారణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈవేసవి తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు ఉదయం, సాయంత్ర వేళల్లో మాత్రమే అధికంగా బయటి ప్రదేశాల సందర్శన చేయాల్సిన సమయం విచ్చేసింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. ఈ మేరకు ప్రజలు చల్లని పానియాలు వైపు, చల్లని ప్రదేశాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ మేరకు జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత్తలో పరుగులు, నడకలు చేస్తే వడదెబ్బ గురి అయ్యే అవకాశం ఉంది.

రికార్డు స్థాయిలో 40.5 డిగ్రీల నమోదు
మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం గరిష్ఠ స్థాయిలో 40.5 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పెరుతుండడంతో ప్రజలు వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మేరకు ప్రజలు వేసవి తాపం నుంచి రక్షణ కవచాలు తీసుకుని బయటి ప్రదేశాలు తిరగాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటి ప్రదేశాలల్లో పనులు పెట్టుకుంటే వేసవితాపం నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వేసవి తాపం ఎక్కువ కావడంతో ప్రజలు వేసవి నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మట్టికుండలు, చల్లనీపాయాలకు గిరాకీ పెరిగింది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...