అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచండి


Wed,March 20, 2019 01:22 AM

-పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి రొనాల్డ్‌రోస్
- ఎన్నికల అబ్జర్వర్లతో సమావేశమైన ఎన్నికల అధికారి
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల పెడుతున్న ఖర్చుల వివరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లును ఎన్నికల అధికారి రొనాల్డ్‌రోస్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గలకు సంబంధించి కేటాయించిన నియోజకవర్గాల వివరాలను తెలియజేశారు. నియోజకవర్గాలల్లో ప్రత్యేకంగా నిఘా ఉంచి ఖర్చుల వివరాలను, అభ్యర్థుల ప్రచార విషయాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. కొడంగల్, నారాయణపేట, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గాలకు ఇండియన్ సర్వీసెస్ అధికా నితిన్‌వాపాను, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మఖ్తల్ ఎక్స్‌పెండించర్ అబ్జర్వర్‌గా ఐఆర్‌ఎస్ అధికారి అరవింద్ పీ బాన్‌సోడేలకు కేటాయించినట్లు తెలిపారు. ఎలాంటి సందేహాలు వచ్చిన వెంటనే నివృత్తి చేసుకుంటు ముందుకు సాగాలని వారికి సూచించారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ క్రాంతి, రిటర్నింగ్ అధికారి కే స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్‌వో శారద ప్రియదర్శిని, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత తదితరులు ఉన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...