కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం


Wed,March 20, 2019 01:21 AM

- రెండో రోజుకు చేరిన ఉత్సవాలు
-పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
అడ్డాకుల : మండలంలోని కందూరుశ్రీరామలింగేశ్వర స్వామి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్వామివారి సన్నిధిలో శివపార్వతుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. మేళ, తాళాలు, భాజా భజంత్రీలు, మధ్య పురోహితులు శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం కందూరు గ్రామం నుంచి శివపార్వతుల కల్యాణానికి నూతన వస్ర్తాలు, పసుపు, కుంకుమ, తలంబ్రాలను పల్లకీలో గ్రామ ప్రజలు తప్పెట్లతో ఊరేగింపుగా రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలోకి తరలించారు. అమ్మవారి వస్ర్తాలు, తలంబ్రాలకు మహిళలు మంగళహారతులు పట్టారు. అనంతరం మధ్యాహ్నం 3-15 గంటలకు పురోహితుల వేద మంత్రాలతో స్వామి వారి కల్యాణాన్ని సంప్రదాయ బద్ధంగా జరిపించారు. కందూరు గ్రామానికి చెందిన కొంతమంది దంపతులు స్వామి వారి కల్యాణ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలు చూడటానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, తోకల శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...