తెలంగాణ సత్తా ఢిల్లీకి చాటాలి


Wed,March 20, 2019 01:20 AM

- 16 ఎంపీ స్థానాలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం
- ఉదారత్వం ఉన్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్
-దేశం ఆలోచించేలా ఉద్యమాన్ని ఉధృతం చేసిన వ్యక్తి..
- వందేైళ్లెనా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావు
-ప్రతి ఒక్కరూ విశాలతత్వంతో పని చేయాలి
- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల నాయకులతో సమావేశం
-వివిధ పార్టీలకు చెందిన 100 మంది టీఆర్‌ఎస్‌లో చేరికలు
పెబ్బేరు : పార్లమెంటరీ ఎన్నికల్లో తెలంగాణ సత్తా ను ఢిల్లీకి చాటాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చా రు. మంగళవారం పట్టణ కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో టీఆర్‌ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షు డు హరిశంకర్ నాయుడు ఆ ధ్వర్యంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల నాయకులతో పార్లమెంటరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిధంగా రానున్న పార్లమెం ట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు ఏకపక్షంగా తీర్పు ఇచ్చేలా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 16 మంది ఎంపీలను అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చి ఢిల్లీకి పంపించాలని తెలిపా రు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థి అ భ్యర్థి ఎనలేని మాటలు మాట్లాడిన వ్యక్తిని నేడు తన పక్కల కూర్చోబెట్టుకున్న ఉదారత్వం ఉన్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆరే అని పేర్కొన్నారు.

ఆంధ్రా ప్రభుత్వాల పాలనలో 60 ఏళ్లు తెలంగాణ ప్రజానికం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. స్వరాష్ట్ర సాధన సమయంలో దే శం మొత్తం ఆలోచింపజేసేలా ఉద్యమాన్ని ఉధృతం చే సి రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. వందేైళ్లెనా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ది బాధ్యత ప్రజలు టీఆర్‌ఎస్ పైన పెట్టి తిరిగి అధికారాన్ని ఇచ్చారన్నారు. రాష్ర్టానికి రావల్సిన నిధులను కేంద్రం మెడలు వంచి తెచ్చుకునేందుకు 16 మంది ఎంపీలను గెలిపించే బాధ్యత ప్రజలపైన ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశం దృష్టిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్షించారని తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించేందుకు ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకవచ్చేలా ప్రతి కార్యకర్త సిపాయి వలే పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో అనవసరమైన పంచాయతీలు వద్దనే ఉద్దేశంతో అన్ని పార్టీల నుంచి చేరికలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అందరం ఏకమై గ్రామాలను, రాష్ర్టాన్ని అభివృద్ధి పర్చుకుందామని పిలుపునిచ్చారు.

మంత్రి సమక్షంలో 100 మంది చేరిక..
సమావేశంలో భాగంగా పెబ్బేరు, శ్రీరంగాఫూర్ మండలాల్లోని వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రె డ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ మం త్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించా రు. చేరిన వారిలో పెబ్బేరులోని అంబేద్కర్ కాలనీకి చెందిన 55 మంది, నాగరాల గ్రామానికి చెందిన 20 మంది, కొత్త సూగురుకు చెందిన 25 మంది ఉన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...