ప్రజల సహకరిస్తేనే..ప్రశాంతంగా ఎన్నికలు


Wed,March 20, 2019 01:20 AM

-ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతలో ప్రజల సహకారమే అత్యున్నతమైనది
-ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం
-రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్
-ఈవీఎంల పనితీరును వివరించిన కలెక్టర్
-హాజరైన నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతలో ప్రజలు సంపూర్ణ సహాకారం అం దించడం అత్యుమైనదిగా ఉంటుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో విలేకరులు, రాజకీ య పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాజకీయ నేతలు, మీడియా పూర్తిస్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిపించేందుకు సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే విస్తృతంగా ఎన్నికలపై ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రచార వాహనాలతో, కళాజాతతో ఓటు వినియోగంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 25వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సూచించారు. అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో జరిపించేందుకు మరింత సహకారం అందించాలని సూచించారు. అనంతరం ఈవీఎంల పనితీరు, ఉపయోగించుకునే విధానాలను రాజకీయ నేతలకు, వివిధ పార్టీల నేతలకు వివరించారు. ఓటింగ్ వేయు విధానం ప్రాక్టికల్‌గా ప్రత్యేకంగా వివరించారు. ఎలాం టి సందేహాలు వచ్చిన ప్రజలు పూర్తిస్థాయిలో మాక్‌పోలింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నా రు. గ్రామాల్లో ప్రస్తు తం మాక్ పోలింగ్ విధానం ద్వారా అం దరికి ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం రెండో రోజు నామినేషన్ల గడువు నడు స్తుందన్నారు. ఈ నెల 25 తేదీతో నా మినేషన్ల పర్వం సమయం ముగుస్తుందని సూచించారు.

విధులు బాధ్యతగా నిర్వహించండి
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను బాధ్యతగా అధికారులు నిర్వహించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లోని నియమ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుం డా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఎలాం టి సందేహాలు వచ్చినా వెంటనే నివృతి చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. ఈవీఎంల భద్రత విషయంలోను ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సూర్యరశ్మి పడితే వాటిలో ఉండే సెన్సార్ పనిచేయదనే విషయం అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎక్కడ ఎలాం టి సమస్యలకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, స్పెషల్ కలెక్టర్ క్రాంతి, డీఆర్‌వో కె.స్వర్ణలత, ఆర్డీవోలు శ్రీనివాసులు, సీహెచ్.శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...